# సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు..
నర్సంపేట,నేటిధాత్రి :
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలు నియంత్రించలేని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాలు గద్దెదిగాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు తగ్గించాలని సిపిఐ నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల ట్రాన్స్ పోర్ట్ చార్జీల పెరిగి నిత్యవసర వస్తువులైన ఉప్పు పప్పు అల్లం ఎల్లిగడ్డ బియ్యం నూనె కూరగాయలు ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితిలోకి నెత్తి వేయబడుతున్నారని అన్నారు. జీఎస్టీ పేరు తోటి ప్రజల్ని దోపిడీ చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలో అధికారం ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా మద్దతు తెలియజేస్తూ మేము బిజెపికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ రెండు పార్టీల దోపిడి విధానాన్ని పసిగట్టి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెళ్లి రమేష్, మండల కార్యదర్శి గడ్డం యాకయ్య, జిల్లా సమితి సభ్యులు మియాపురం గోవర్ధన్, పాలక కవిత, దిడ్డి పార్థసారథి, పిట్టల సతీష్, అంస మంజుల, తిట్టే మమత, బాధరాబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
# గీసుకొండ మండలంలో నిరసన కార్యక్రమం….
# ధరల పెరుగుదల వలన నిరుపేదలకు పెనుబారంగా మారిందని సీపీఐ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు వీరగోని శంకరయ్య, గుండె భద్రిలు అన్నారు.రాష్ట్రంలో,కేంద్రంలో పెరిగిన నిత్యావసర సరుకులు,విద్యుత్ చార్జీల పట్ల ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ గీసుకొండ మండల కార్యదర్శి తోట చంద్రకళ అధ్యక్షతన మండలంలోని కొనాయమాకుల వద్ద గల నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు.సుమారు గంట పాటు నిరసన కార్యక్రమం చేపట్టగా ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటినుండి నేటి వరకు ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. అధికంగా పెంచిన విద్యుత్ చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సంయుక్త కార్యదర్శి రత్నాకర్ రెడ్డి,సెనిగరపు దేవరాజు,తానాల మహేష్, మోకిడే పద్మ,రోజా,మమత,చుక్క శోభ తో పాటు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.