ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏరియాలలో ఉన్న సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత వాసుల ఆరోగ్య సౌకర్యార్థం ఆయుర్వేద వైద్య వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది. “మాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద” హైదరాబాద్ వారి సౌజన్యంతో కొత్తగూడెం ఏరియాలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని తేదీ:23.08.2024 న (బుధవారం) ఉదయం: 9.30గంటలకు నుండి 1.00గంటల వరకు రుద్రంపూర్ సేవా సెంటర్ నందు, ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడునని కొత్తగూడెం జనరల్ మేనేజర్, ఎం.షాలెం రాజు గారు ఓ ప్రకటనలో తెలిపారు హైదరాబాదుకు చెందిన డాక్టర్ విశ్వనాథ మహర్షి ఫోన్ నెంబర్ 9849574706 గారిచే ఈ ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించబడనని డాక్టర్ ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి తగిన ఆయుర్వేద మందులను ఎటువంటి లాభపక్ష లేకుండా తగు మూల్యంతో ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు. డెంగ్యూ, వైరల్, ఫీవర్, బిపి, మధుమేహం, చర్మవ్యాధులు, క్యాన్సర్, ఎయిడ్స్, దీర్ఘకాలిక వ్యాధులన్నిటి నుండి ఎలా కాపాడుకోవాలో పాటించవలసిన పద్ధతులు సూచనలు, సలహాలు ఇస్తారని తెలియజేశారు. కావున కొత్తగూడెం పరిసర ప్రజలు కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత ఆయుర్వేద శిబిరంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కొత్తగూడెం జిఎం ఎం. షాలెం రాజు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *