అంగన్వాడి టీచర్ల నిరావధిక సమ్మెను జయప్రదం చేద్దాం

సి ఐ టి యు, ఏ ఐ టి యు సి, జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు.

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల తాసిల్దార్ కి జిల్లా సిఐటియు కార్యదర్శి రమణ, అంగన్వాడీ టీచర్లతో కలిసి సమ్మె నోటీసును తహసిల్దార్ కి వినతిపత్ర ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధత సౌకర్యాలు ఏవి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగులుగా హెల్త్ కార్డులు ఇచ్చారు. పసిస్ మా బెంగాల్ కేరళ అస్సాం అస్సాం తదితర రాష్ట్రాలలో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ చెల్లిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి అంగన్వాడి వర్కర్లు పేరును టీచర్స్ గా మార్చారు. కానీ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. వారి డిమాండ్లు.

1, అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి.
2, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి.
3, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాటివిటీ చెల్లించాలి.
4, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు. మరి హెల్పర్లకు 500000 చెల్లించాలి.
5, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలి.
6, అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా కల్యాణ లక్ష్మి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు చేయాలి.
7, అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.తదితర డిమాండ్లతో ఈనెల 11 లోపట ఈ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా నిరావాదిక సమ్మెలకు వెళ్తారు అని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కోడం రమణ, మరియు సిఐటి యూ జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ, మరియు మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!