విద్యుత్ ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికుల ధర్నా…

విద్యుత్ ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికుల ధర్నా

విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికుల ధర్నా కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది ఈ కార్యక్రమం టీవీఏఈ జేఏసీ చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి, కన్వీనర్ తిప్పరపు రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు డివిజన్ల నుండి సుమారు 80 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ యల్లా సురేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా యల్లా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలో ఒకే విధమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఒక విధంగా, ఓ ఎండమ్ ఉద్యోగులకు ఏపీఎస్పీ సర్వీసెస్ ఇస్తున్నారు ఆన్‌మ్యాన్ కార్మికులకు ఆర్టిజన్ గా గుర్తించాలని ఒకే సంస్థలో ఒకే విధంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రెండు సర్వీస్ రూల్స్ విధానం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా అందరు ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ ప్రకారం కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉన్న రెండు విద్యుత్ డిస్కమ్‌లలో ఎస్పీడీసీఎల్‌లో ఆన్‌మ్యాన్ కార్మికులను ఇప్పటికే ఆర్టిజన్‌గా గుర్తించగా, ఎన్పీడీసీఎల్‌లో గుర్తించకపోవడం అన్యాయమని తెలిపారు. ఎస్పీడీసీఎల్ తరహాలోనే ఎన్పీడీసీఎల్‌లో కూడా ఆన్‌మ్యాన్ కార్మికులను ఆర్థికంగా గుర్తించాలని ప్రభుత్వం, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఎప్పుడైనా సమ్మెకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
జిల్లా చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. విద్యార్హతల ఆధారంగా ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ తక్షణమే కన్వర్షన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
జిల్లా కన్వీనర్ తిప్పరపు రాజు మాట్లాడుతూ, ఎన్పీడీసీఎల్ పరిధిలో సుమారు 1600 మంది ఆన్‌మ్యాన్ కార్మికులు అన్యాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీడీసీఎల్‌లో అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించి, ఎన్పీడీసీఎల్‌లో కూడా ఆన్‌మ్యాన్ కార్మికులను ఆర్టిజన్‌గా గుర్తించాలని కోరారు. అదేవిధంగా మీటర్ రీడర్స్, పీస్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, రెండో తేదీన సర్కిల్ ఆఫీస్ వద్ద ధర్నాతో పాటు వంట-వార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఏడో తేదీన ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి, ఎనిమిదో తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు కఠిన హెచ్చరిక జారీ చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికులు భారీగా పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version