పరకాలలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
పరకాల,నేటిధాత్రి
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు బోయిని రాజేష్ సంఘ ఆవరణలో జెండా ఎగరావేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల అందరూ ఐక్యతగా ఉండి మన హక్కులకు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గొడుగు కుమార్,కార్యదర్శి నాగరాజు,డైరెక్టర్లు సారంగపాణి,విజయ్,స్వామి,ఐలయ్య,కుల సంఘం పెద్దలు సాదు పెద్దరాజు,వీర్ల సమ్మయ్య,మఠం సమ్మయ్య, వనం రాజు,కే.రాజు,కుల సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
