ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం: దేశాయిపేట ముదిరాజ్ సంఘంలో జెండా ఆవిష్కరణ
మత్స్య కార్మికుల దినోత్సవ వేడుకల్లో ముదిరాజ్ సంఘం ఐక్యతకు పిలుపు
నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.
ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ముదిరాజ్ సంఘం దేశాయిపేట భవనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బయ్య స్వామి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సమాజ అభివృద్ధికి అందరూ ఏకమవ్వాలని, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, ముదిరాజ్ యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేశాయిపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షులు విప్ప సుధాకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సంగినేని రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆర్గనైజర్ విప్ప సుధాకర్, సారయ్య, రాజన్ బాబు, బయ్య రాజు, ముత్యాల బాబు, సృజన్, అనిల్, లక్కరాజు, రాకేష్, సతీష్, బిక్షపతి, రవి, కిషన్, వెంకటేష్, కుమారస్వామి, సుధాకర్, విప్ప రాజు, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.
