వడ్లు వేగంగా కొనుగోలు చెయ్యాలి
నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట
బీజేపీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు కుక్కునూరు పల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బిజెపి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రంలోనీ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, తరుగు పేరుతో ఇష్టానుసారంగా కటింగ్ వ్యవస్థను అరికట్టాలని, రానున్న రూతుపవనాలను దృష్టిలో ఉంచుకొని మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలును వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీసం సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అని , గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని ,అంతేకాకుండా కొనుగోలు చేసిన రైతులకు వెను వెంటనే అకౌంట్లో డబ్బులు వేయగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోనాల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు గౌరారం కృష్ణ మండల కోశాధికారి మల్లిపెద్ది రమేష్ , బూతు అధ్యక్షులు రమేష్ యాదవ్, గాండ్ల భాను, కార్యకర్తలు లాస్కరి శ్రవణ్, అఖిల్, బోనగిరి చందు, రొయ్యల స్వామి కుక్కల మధు తదితరులు పాల్గొన్నారు.
