రైతుల ధాన్యం తరుగు లేకుండా ప్రభుత్వ కొనుగోలు చేయాలి

రైతుల ధాన్యం తరుగు లేకుండా ప్రభుత్వ కొనుగోలు చేయాలి

రైస్ మిల్లర్స్ దోపిడీ అరికట్టాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అవకతవకలు కటింగ్ మీద అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రి ఇవ్వడం జరిగింది. సిపిఎం పార్టీ గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఐకెపి కేంద్రాలను పరిశీలించి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూ డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే తీరా అమ్ముకునే సమయంలో ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పింది కానీ ఆచరణలో రైతులు అమ్ముకునే దగ్గర రైస్ మిల్లర్స్ క్వింటాలుకు మూడు నుండి 6 కిలో కట్ చేస్తున్నారని ప్రభుత్వ నమ్స్ ప్రకారం రైతులు ధాన్యాన్ని ఇచ్చిన మిల్లర్స్ మాత్రం కటింగులు ఆపకుండా యదేచ్ఛగా రైతులనుమోసం చేస్తున్నారు. ఐకెపి కేంద్రాల కాడ రైతులకు ధాన్యం కాంట చేసిన తర్వాత రసీదులు ఇవ్వాలి కానీ ఏ ఒక్క కొనుగోలు కేంద్రం దగ్గర రిసిప్ట్ లేవని మాకు తెలవదని ధాన్యం కేంద్ర నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని కేంద్రాలలో రైతులు కటింగ్లకు అంగీకరిస్తేనే గన్ని బ్యాగ్స్ ఇస్తున్నారు లేకపోతే వారి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని పేర్కొన్నారు గతంలో కలెక్టర్ గారు కలిసిన తర్వాత రైతులందరికీ వడ్లు కాంటా తర్వాత రసీదులు ఇస్తామని పేర్కొన్నారు. అయినా అది అమలు కాలేదు ప్రభుత్వ నిబంధన ప్రకారం దాన్యం ఉన్న మిల్లర్స్ కట్ చేస్తున్నారు.ఈ యొక్క కటింగులు వెంటనే ఆపాలని రైతులకు రసీదులు ఇవ్వాలని లేనియెడల భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రైతుల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి రత్నంరాజేందర్ పొదిల్ల చిట్టిబాబు జిల్లా కమిటీ సభ్యులు ఎండి గఫూర్ పాషా గుండు రామస్వామి రత్నం ప్రవీణ్ సద్దాం హుస్సేన్ కొమురెల్లి భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version