చిరు వ్యాపారుల భవనం ఎందుకు పూర్తి చేయడం లేదు
బిఆర్ఎస్ పార్టీ పరకాల సీనియర్ నాయకులునక్క చిరంజీవి
పరకాల,నేటిధాత్రి
టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పరకాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి
పరకాల పట్టణం అభివృద్ధి కోసం చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు 2021 సంవత్సరంలో కోటి 40 లక్షల రూపాయలతో చిరు వ్యాపారుల భవనం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ భవనాన్ని సంబంధిత అధికారులు నిర్మాణ కాంట్రాక్టర్లు ఎందుకు పట్టించుకోకుండా నిర్మాణాన్ని ఆపివేశారు ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.పట్టణంలో చిరు వ్యాపారాన్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వీటిపై వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నారని వీరంతా బస్టాండ్ చుట్టుపక్కల వెల్లంపల్లి రోడ్డు ఇరు వైపుల వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని ప్రస్తుత శాసనసభ్యులు చిరు వ్యాపారుల భవనం పూర్తి చేసి ఉంటే ఈరోజు వ్యాపారస్తులు రోడ్డున పడే పరిస్థితులు వచ్చేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు, నేడు భవనం లేక పోవడంతో రహదారులపై వ్యాపారం చేసుకుంటున్న దాదాపు 250 కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉందని, చిరు వ్యాపారుల స్థితిగతులు తెలుసుకొని, వారు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ ప్రభుత్వంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఇ భవన నిర్మాణాన్ని మొదలు పెట్టారని, వెంటనే సంబంధిత అధికారులు పరకాల శాసనసభ్యులు చొరవ తీసుకొని బిల్డింగ్ పూర్తి చేసి చిరు వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
