ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల…

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

 

ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

 ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కట్టెల పొయ్యిలు, వంట పాత్రలు, ఎల్పీజీ సిలిండర్ల పోస్టర్లతో నిరసనకు దిగారు. విపక్షాల ఆందోళనలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పాల్గొని ప్రసంగించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు.
ఎల్పీజీ సమస్యను పరిష్కరించాలి..

ఎల్పీజీ సమస్యను కేంద్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 18వ లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ ప్రభుత్వ అజెండాగా మారిందని ఆగ్రహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రంప్‌నకు మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు, ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్…

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

 

ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్(T20 World Cup2026)లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.. టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2011 వన్డే ప్రపంచకప్‌లో భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను అప్పటి పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. ఆ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంటర్వ్యూలో అఫ్రిది(Shahid Afridi) మాట్లాడుతూ..’వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌2011లో మొహాలీలో టీమిండియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మ్యాచ్‌లో మేము చాలా అద్భుతంగా బ్యాటింగ్ ప్రారంభించాము. మా ఓపెనర్లు మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్‌ను ఓడించడం ఖాయమని చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. కానీ తొలి వికెట్ పడగానే సీన్ మారిపోయింది’ అని గుర్తు చేసుకున్నాడు.

‘మా తొలి వికెట్ పడగానే స్టేడియంలోని అభిమానులు టీమిండియాను ఉత్సాహపరిచిన తీరు అమోఘం. ఆ కేరింత‌లు, అరుపుల దెబ్బకు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవ‌డం నేను చూశాను. అదే సమయంలో భార‌త్(Team India) తిరిగి అద్భుతంగా పుంజుకుంది. హఫీజ్ ఔటైన తర్వాత, మా బ్యాటర్లు వ‌రుస క్రమంలో పెవిలియ‌న్‌కు చేరారు. ప్రతీ బంతికి ఇబ్బంది పడ్డారు. స్టేడియంలో విపరీతమైన గోల మ‌ధ్య మా ప్లేయ‌ర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. కనీసం నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు’ అని అఫ్రిది వెల్లడించాడు.

కాగా 2011 ప్రపంచ కప్‌లో మొహాలి వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ 231 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో29 పరుగుల తేడాతో పాక్ పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 85 ప‌రుగులు చేసిన స‌చిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ప్లేయ‌ర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version