ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్
ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.
‘మా తొలి వికెట్ పడగానే స్టేడియంలోని అభిమానులు టీమిండియాను ఉత్సాహపరిచిన తీరు అమోఘం. ఆ కేరింతలు, అరుపుల దెబ్బకు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవడం నేను చూశాను. అదే సమయంలో భారత్(Team India) తిరిగి అద్భుతంగా పుంజుకుంది. హఫీజ్ ఔటైన తర్వాత, మా బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. ప్రతీ బంతికి ఇబ్బంది పడ్డారు. స్టేడియంలో విపరీతమైన గోల మధ్య మా ప్లేయర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. కనీసం నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు’ అని అఫ్రిది వెల్లడించాడు.
కాగా 2011 ప్రపంచ కప్‌లో మొహాలి వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 పరుగుల లక్ష్య చేధనలో పాక్ 231 పరుగులకు ఆలౌటైంది. దీంతో29 పరుగుల తేడాతో పాక్ పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 85 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
