`ప్రజల్లో వున్నారా… ఎన్నికలప్పుడే కనిపిస్తారా?
`ఐక్యంగా ఉన్నారా.. పార్టీ కోసం పని చేస్తున్నారా?
`పార్టీ బలపడాలని లేదా.. మీ వల్ల కాదనుకుంటున్నారా?
`8 మంది ఎంపిలను గెలిపించినా జనానికి చేరువ కాలేరా!
`8 మంది ఎమ్మెల్యేలున్నా కలిసి పోరాటం చేయలేరా?
`ఎమ్మెల్సీలు ఎక్కడున్నారో తెలియదు? ఏమి చేస్తున్నారో అర్థం కాదు?
`ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా…6 గ్యారంటీలు అడగరా!
`రైతు సమస్యలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా?
`హాస్టళ్ళలో విద్యార్థుల గోస కనిపించడం లేదా?
`ప్రజా సమస్యలు పట్టించుకోవొద్దనుకుంటున్నారా!
`ఎవరికి వారే యమునాతీరేనా!
`నాకేం తక్కువ… నేనెవరికంటే తక్కువా అని అనుకుంటున్నారా?
`కమలం పార్టీ నేతల్లో సఖ్యత లేదా?
`జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి కూడా రాలేక పోయారా?
`బొట్టుపెట్టి పిలిస్తే తప్ప సమావేశాలకు హాజరు కాలేరా?
`రాష్ట్ర సమస్యలు గాలికి వదిలేశారు?
`రైతు సమస్యలు పట్టించుకోవడమే మానేశారు?
`పాలక పక్షం మీద నోరు తెరిచే దైర్యం చేయడం లేదు?
`కార్యకర్తల్లో నిస్తేజం ఆవహిస్తున్న పట్టించుకోవడం లేదు?
`ప్రజా ఉద్యమాల ఊసే లేదు?
`వరుసగా అన్ని రాష్ట్రాలు గెలుస్తూ వస్తున్నా తెలంగాణా లో ఊపు రావడం లేదు.
`పల్లె పోరులో ప్రభావం వద్దనుకుంటున్నారా?
`జిహెచ్‌ఎంసి వదిలేసుకుంటారా?
`ఉప ఎన్నికలోస్తాయని తెలిసినా కార్యాచరణ లేనట్టేనా?
హైదరాబాద్, నేటిధాత్రి:
గత బిఆర్‌ఎస్ హాయాంలో వున్న దూకుడులో బిజేపికి పదిశాతం వున్నా, ఈ పాటికి రాష్ట్రంలో మరింత బలపడే అవకాశం నూరుశాతం వుండేది. కాని ఎందుకో బపడాలన్న కోరిక నాయకుల్లో కూడా కనిపించం లేదనిపిస్తోంది. వారి వ్యాహారశైలి జనానికి అలాగే తోస్తోంది. పార్టీలో నాయకులంతా నాకంటే ఎవరు ఎక్కువ..నాకేం తక్కువ! అనే ఆలోచనల్లోనే అందరూ వున్నారు. ఇవే కమలంలో నేతల మధ్యకలతలు సృష్టిస్తున్నాయని, ఆదిపత్యాలు పొడసూపేలా చేస్తున్నాయంటున్నారు. ఇక బిజేపి అగ్రనాయకుల మధ్య ఆదిపత్యాలలో గాని, అధికార దర్పంలో గాని చేసుకునే విమర్శల్లో దాపరికాలేమీ కూడ కనిపించడం లేదు. వారు తమకు పడని సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న విమర్శల్లో ఎక్కడా షశబిషలు కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తెలంగాణలో వున్న బిజేపి ఎనమిది మంది ఎంపిలంతా ఒక్కతాటిమీద లేరు. ఇది స్పష్టం. పెదవుల మీద ప్లాస్టిక్ పువ్వలు విరిసినంత మాత్రనా అవి నవ్వులు కావు. వారి మధ్య వున్నది ఆప్యాయత కాదు. గౌరవం అంతకన్నా కాదు. కేవలం పది మందిలో పలుచన కాకుండా చూసుకునే జాగ్రత మాత్రమే..మీడియా కంట పడకుండా జాగ్రత్తపడడం మాత్రమే. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారయ్యారు. ఎంపిలకు ఒకరికంటే ఒకరికి పడడం లేదంటే, ఎమ్మెల్యేలు మేమేం తక్కువ తిన్నామా? అన్నట్లే వుంది. ఇక్కడ ఎమ్యెల్యే మధ్య ఆధిపత్యం కనిపించడం లేదు? కాని ఎడమొహం, పెడమొహంలా వుంటున్నారు. అసలు ఒకరికొకరు పరిచయం లేనట్లుగానే వుంటున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చి ఏనాడు మీడియా సమావేశాలు కూడా పెద్దగా ఏర్పాటు చేసిందిలేదు. ప్రభుత్వం మీద మాట్లాడుతున్నది లేదు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడిగే ఎమ్మెల్యేనే లేకుండాపోయారు. అసలు వాళ్లంతా ఎక్కడుంటున్నారో కూడా ఎవరికీ తెలియదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం పెద్దగా చేసింది లేదు. అభ్యర్ది ఎంపికపై కూడా ఎవరూ స్పందించింది లేదు. సీటు గెలవాలన్న ఆలోచన ఎవరూ చేయలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎవరు పాలుపంచుకున్నారో..ఎవరు రాలేదో కూడా తెలియని పరిస్ధితి నెలకొని వుంది. మొత్తం మీద పార్టీ ప్రెసిడెంటు రామచంద్రరావు వైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి? ఆయన పార్టీ అద్యక్షుడు కావడం పార్టీలో చాలా మందికి ఇష్టం లేదు. ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది లేదు. నిలదీస్తున్నది లేదు. ఉద్యమాలు చేస్తున్నది లేదు. పోరాటాలకు పిలుపునిస్తున్నది లేదు. పార్టీ ప్రెసిడెంటు వున్నారా? అంటే వున్నారు అనిపించేలా మాత్రమే వుంది. అదే ఇతర కాడర్‌కు మింగుడు పడడం లేదు. ఈసారి ఎలాగైనా సరే ప్రెసిడెంటు కావాలని కలలు గన్న ఎంపిలంతా ఒక్కసారిగా చల్లబడిపోయారు. తాము ఏది మాట్లాడినా, ప్రభుత్వంమీద యుద్దం చేసినా ఆ క్రెడిట్ అంతా అధ్యక్షుడి ఖాతాలోకి పోతుంది. తమకు వచ్చే మైలేజీ ఏమీ వుండదు అనే ఆలోచనల్లో ఎంపిలున్నట్లు తెలుస్తోంది . పార్టీ అద్యక్షుడైన రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ముందు చెప్పారు. తర్వాత ఎందుకు చేతులెత్తేశారు? అనేది ఎవరికీ ఆర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు ఆయన ప్రచారానికి క్షేత్ర స్దాయికి కూడా వచ్చినట్లు కనిపించలేదు. ఎవరైనా పార్టీ లైన్ దాటి పార్టీ మీద మాట్లాడితే నాయకులను కూడా సహించేది లేదని మాత్రం రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీద విమర్శల పర్వం ఎక్కువయ్యాయి. అయినా ఆయన కూడా తనపని తాను చేసుకుపోవడం తప్ప స్పందించడం అనేది కనిపించదు. దాంతో ఇదే సందు అన్నట్లు బహిషృత నేత రాజాసింగ్ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక ఓ ఇద్దరు నేతలపై ఇప్పటికీ వైరం కొనసాగుతుందనేది ఎప్పుడూ మాట్లాడుకుంటూనే వున్నారు. ఆ ఇద్దరు నేతలు ఒకరి మాటలను ఒకరు విమర్శించుకోవడం అలవాటుగా మారింది. ఏ పార్టీ ఎప్పుడు రాజకీయాల్లో దూకుడుగా వుంటుందో? ఎప్పుడు వెనుకబడిపోతుందో అర్దం కాదు. ఎందుకు అలాంటి పరిస్దితులు ఎదురౌతాయో అవగాహన చేసుకోలేరు. ఇప్పుడు బిజేపికి రాష్ట్రంలో వున్న స్దానమేమిటి? ప్రజల్లో ఆ పార్టీకి వున్న ఆదరణ ఏమిటి? అనేదానికి కొలమానం ఏమీ వుండదు. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా బిజేపి డీలా పడిపడిరది అనుకోలేం. కాని పుంజుకోవడం ఎలా? అనేది కూడా పార్టీకి ఎంతో అవసరం. ఎందుకంటే రెండోసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిజేపి అమాంతం పుంజుకున్నట్లే కనిపించింది. వరుస విజయాలు చవి చూసింది. మొదట హుజూరాబాద్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌నుంచి వెళ్లి బిజేపిలో చేరిన ఎంపి ఈటెల రాజేందర్ అనూహ్యమైన మెజార్టీతో గెలిచారు. ప్రజలు ఈటెల రాజేందర్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత వచ్చిన దుబ్బాక ఎన్నికల్లోనూ బిజేపి గెలిచింది. 2023 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజేపి తరుపున పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పది వేల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఆ మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలు చవి చూసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 3వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. అలాగే దుబ్బాకలో కూడా కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కలేదు. మునుగోడులోనూ అంతే. కాని అదే సమయంలో కర్నాకటలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బిజేపి తెలంగాణలో చతికిల పడిరది. కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. అందుకు కారణం ఆనాటి అధ్యక్షుడైన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించమే కారణమని అంటారు. ఇప్పటికీ ఆ అపవాదు వుంది. అయితే గత ఎన్నికల్లో బిజేపి అనుకున్నంత పాత్ర పోషించలేదు. ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిన బిజేపి కనీసం తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర దాకా కూడా రాలేదు. కాని తెలంగాణలో అనూహ్యంగా ఎనమిది మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నది. తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో ఎనమిది మంది ఎంపిలను గెల్చుకున్నది. కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. ఎంత సేపు నాయకుల మధ్య వివాదాలు, విభేదాలు, ఆదిపత్య పోరులు మాత్రమే తెరమీదకు వస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల సమయంలో డిల్లీలో నాయకులంతా కలిసి కనిపించడం తప్ప, తర్వాత హైదరాబాద్‌లో కలసి సమావేశమైన సందర్భాలు పెద్దగా లేవు. ఆ మధ్య కొత్త అద్యక్షుడి ఎంపిక సమయంలో నాయకులంతా కొద్దో గొప్పో హడావుడి చేశారు. నేనంటే నేనే అధ్యక్షుడిని అని కూడా చెప్పుకున్నారు. నాకేంతక్కువ? అని కూడా ప్రశ్నించిన మీడియాను ఎదురు ప్రశ్నించారు. అందులో అందరూ వున్నారు. కాకపోతే ఈటెల రాజేందర్ బాగా ఆశలు పెట్టుకున్నారు. ఒక దశలో ఈటెల రాజేందర్‌ను అధ్యక్షుడిని చేస్తారంటున్నారన్న వార్తలు బాగానే చక్కర్లు కొట్టాయి. కాని అవి వాస్తవ రూపం దాల్చలేదు. నిజం చెప్పాలంటే గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కనీసం హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీలో ఆయన పరపతి పెరిగేది. కాని రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. తప్పని పరిస్దితుల్లో ఆయనకు మల్కాజిగిరి ఎంపిగా నిలబెట్టారు. హుజూరాబాద్‌లో గెలిస్తే ఈటెల రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్ట బాగా పెరిగేది. పార్టీకూడా ఎంతో గౌరవం ఇచ్చేది. కాని ఆయన ఓడిపోయారు. మల్కాజిగిరి ఎంపిగా గెలిచినా ఆయన పార్టీ వల్ల గెలిచాడే తప్ప ఇక్కడ ఈటెలను చూసి గెలించలేదన్నది పార్టీలో చాలా మంది అభిప్రాయం. పార్టీలో కూడా ఇదే భావన వుంది. అయినా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్నారని అనుకున్నారు. కాని కాలేదు. ఇక మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఏదో ఒక వివాదం ఎప్పుడూ సాగుతూనే వుంటుంది. అందుకు కారణాలు వున్నాయి. గతంలో బండి సంజయ్ అద్యక్షుడిగా తొలగింపులో ఈటెల హస్తమే పని చేసిందనేది ఓ వాదన వుంది. అది నిజమే అన్నట్లు బండి సంజయ్ కూడా కొన్ని సార్లు ఈటెలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అదే నిజమని బండి సంజయ్ అనుచరులు నమ్ముతున్నారు. ఆనాటి నుంచి రగులుకుంటున్న వివాదం చల్లారలేదు. ఇప్పట్లో చల్లారుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలను ఈటెల రాజేందర్ మరోసారి తప్పు పట్టారు. అది మళ్లీ వివాదాన్ని రేపింది. తాజాగా హుజూరాబాద్ పర్యటనలు మళ్లీ చలిమంటలు రేపుతున్నాయి