సీపీఐ శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలి…
సిపిఐ జిల్లా, పట్టణ కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్ ,మిట్టపల్లి శ్రీనివాస్
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ లో ఈ నెల 26 న నిర్వహిస్తున్న సిపిఐ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు. భారత గడ్డపై సీపీఐ ఎన్నో పోరాటాలు , ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్వహించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఆర్కేపి ఉపరితల గని రెండో దఫా పనుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొని, ఉపరితల గని వల్ల ఇబ్బంది కలిగే ప్రజల పక్షాన నిలబడతామని అన్నారు. ఉపాధి అవకాశాలు స్థానికులకు ఇవ్వాలని కోరతామని అన్నారు .ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య, మొండి, ఈరవేణి రవీందర్,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
