తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి….

తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి

*10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

నర్సంపేట,నేటిధాత్రి:

వార్డులో తడి చెత్త పొడి చెత్త వేరుచేసి సరిసారాలను పరిశుభ్రంగా ఉంచాలని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హన్మకొండ 10వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై వార్డు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు మోరీలలో చెత్తాచెదారం, ప్లాస్టిక్, పేపర్లు, పాత బట్టలు వేయవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల మురికి నీరు నిలిచిపడి దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.మున్సిపాలిటీ చెత్త సేకరణ బండిలోనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేయాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని తెలిపారు. చెత్త బండి సమయానికి రాకపోతే అధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత మున్సిపాలిటీ లేదా ప్రజాప్రతినిధుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వార్డు ప్రజలు అందరూ సహకరించి వార్డును పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ ముదురుకోల నవీన్, 10వ వార్డు అధికారి రహీం పాషా, శానిటరీ జవాన్ భరత్, ఆర్‌పి సువర్ణ, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు కొలువుల వెంకట్, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version