కాంగ్రెస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం….

కాంగ్రెస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని ఆ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన ఎమ్మెల్సీ చీఫ్ విప్ పత్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లతో కలిసి అలియాబాద్ 8వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి కంటం శ్వేత కృష్ణ రెడ్డి ల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ మునిసిపల్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తుంకి రమేష్, మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాధవరెడ్డి శంకర్ రెడ్డి, నర్సింహారెడ్డి, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version