సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి

* కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్

నేటిధాత్రి, చేవెళ్ల :

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ మహారాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్, రామస్వామి, సుభాన్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 316వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం చేవెళ్లలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళీలు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన ఆత్మగౌరవానికి,ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రామస్వామి, ప్రకాష్ గౌడ్, శుభాన్ గౌడ్, సుధాకర్ గౌడ్, కృష్ణగౌడ్, గొల్లపల్లి సత్యం తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version