అక్షరాస్యత 100శాతం సాధించాలి
అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.అనంతరం మాట్లాడుతూ మనదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అక్షరాస్యత 18శాతం ఉండగా ప్రస్తుతం 76శాతానికి చేరుకున్నామని తెలంగాణ రాష్ట్రంలో 66 శాతం అక్షరాస్యత ఉందని ఇంకా 34శాతం నిరక్షరాస్యులు మిగిలిపోయారని ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా వంద శాతం అక్షరాస్యతకు చేరుకోవాలని అన్నారు.శిక్షణ పొందిన విఓఏలు ఆర్పీలు ప్రణాళిక సిద్ధం చేసుకుని గ్రామంలో వంద శాతం అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని సూచించారు.ఈ శిక్షణకు రిసోర్స్ పర్సన్ గా బిక్షపతి మరియు బాబు వ్యవహరించారు.ఈ శిక్షణకు వివిధ గ్రామాల నుంచి ఉపాధ్యాయులు,సీఆర్పీలు రమేష్,శ్రీలత,రఘుబాబు, మహేందర్ మరియు మెప్మా ఆర్పీలు,బాలుర ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయులు మహ్మద్ గౌస్ ఏపీయం మహేందర్ పాల్గొన్నారు.