టాక్సిక్ స్టోరీ లీక్1961 గోవా బ్యాక్‌డ్రాప్..

టాక్సిక్ స్టోరీ లీక్1961 గోవా బ్యాక్‌డ్రాప్

 

కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో మరోసారి వెండితెరపై విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకున్న మాస్ అప్పియరెన్స్‌కు ఖచ్చితంగా వైలెన్స్ ఉన్న సినిమానే చేయాలి లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేంతలా. అందుకే.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఎన్నో కథలు విని చివరికి టాక్సిక్ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత ఇండియాలో పెను సంచలనమే సృష్టించింది. కొందరు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అని పొగడ్తలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం మసాలా కంటెంట్ ఏంటి ఈ రేంజ్‌లో ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ సినిమాను ముందుగా మార్చి 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు.

సాధారణంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు అంటే ముంబై అండర్ వరల్డ్, లేదంటే అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరుగుతుంటాయి. కానీ టాక్సిక్ సినిమా కోసం గోవా చరిత్రలోని ఒక క్లిష్ట సమయాన్ని ఎంచుకున్నారు. మన దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉంది. ఆ 14 ఏళ్ల కాలంలో గోవాలో స్మగ్లింగ్ ముఠాలు ఎలా రాజ్యమేలాయి? రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి? అనే అంశాల చుట్టూ ఈ ఫిక్షనల్ డ్రామా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కథ 1940లో మొదలై 1970 వరకు.. అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక సామ్రాజ్యం పుట్టుక, దాని పతనం ఎలా జరిగిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట.
ఈ సినిమాలో యష్ ‘రయా’ అనే పవర్ రోల్‌లో నటిస్తున్నాడు. మొత్తానికి ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ నుంచి.. టీజర్, సాంగ్స్ ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version