శ్రుతి హాసన్‌ పెళ్లిరంగంలోకి కమల్..వరుడు అతనేనా?

శ్రుతి హాసన్‌ పెళ్లిరంగంలోకి కమల్..వరుడు అతనేనా?

శ్రుతి హాసన్.. కేవలం కమల్ హాసన్ వారసురాలు మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘బ్రాండ్’ క్రియేట్ చేసుకున్న మల్టీట్యాలెంటెడ్ స్టార్.
సౌత్ స‌హా బాలీవుడ్ లోనూ అన‌తి కాలంలోనే సినిమాలు చేసి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసింది. వ్వ‌క్తిగ‌త జీవితంలోనే శ్రుతిహాస‌న్ ప్రేమాయ‌ణాలు న‌డ‌ప‌డంలోనూ త‌క్కువేం కాద‌ని ప్రూవ్ చేసింది. తొలుత విదేశీయుడు మైఖెల్ కోర్స‌లేతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. అత‌డినే పెళ్లాడాల‌నుకుంది.

ఈ క్ర‌మంలో మైఖెల్ ను డాడ్ కు సైతం ప‌రిచ‌యం చేసింది. కానీ ఎందుక‌నో ఆ బంధం పెళ్లి వ‌ర‌కూ దారి తీయ‌లేదు. అటుపై కొంత గ్యాప్ తీసుకుని ముంబైకి చెందిన శంత‌ను హాజారికాతోనూ డేటింగ్ చేసింది. తొలి వైఫ‌ల్యం నేపథ్యంలో శంత‌ను పెళ్లాడుతుంద‌ని అంతా భావించారు. కానీ ఈ బంధం కూడా మ‌ధ్య‌లోనే వీగిపోయింది. అప్ప‌టి నుంచి అమ్మ‌డు ప్రేమ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటూ వృత్తిగ‌త జీవితంపైనే దృష్టి పెట్టింది. సినిమాలు త‌ప్ప మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌ని చేస్తోంది. ఈ నేప‌థ్యంలో శ్రుతి హాస‌న్ గురించి ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

కమల్ హాసన్ తన గారాల పట్టి కోసం సరైన వరుడిని వెతికే పనిలో పడ్డారని వార్త‌లొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంబంధాలు చూసార‌ని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై చాలా స్పష్టంగా ఉండే కమల్ కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్‌కు ఇప్పటికే 40 ఏళ్లు నిండాయి. పెళ్లి విష‌యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా క‌మ‌ల్ బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కమల్ హాసన్ తన మిత్రులు, బంధువుల ద్వారా మంచి సంబంధాలను అన్వేషి స్తున్నారుట‌.

బ‌య‌ట కుర్రాడు కంటే? తెలిసిన కుర్రాడైతే బాగుంటుంద‌నే క్ర‌మంలోనే క‌మ‌ల్ తెలిసిన వాళ్ల ద్వారా పెళ్లి కొడుకును వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా క‌మ‌ల్ హాస‌న్ చాలా స‌వాళ్లు ఎదుర్కు న్నారు. వివాహం అనే జీవితంలో క‌మ‌ల్ చాలా కుదుపుల‌కు లొన‌య్యారు. మొద‌టి భార్య‌తో విడాకులు ..ఆ త‌ర్వాత న‌టి గౌత‌మ్ తో రిలేష‌న్ షిప్ వీగిపోవ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌ల్ కూడా సింగిల్ గానే ఉంటున్నారు. సాధార‌ణంగా పెళ్లి విష‌యంలో క‌మ‌ల్ హాస‌న్ ఇష్టాలను..స్వేచ్ఛ ను ఎంతో గౌర‌విస్తారు. శ్రుతి హాస‌న్ కి కూడా క‌మ‌ల్ చాలా స్వేచ్ఛ క‌ల్పించారు. ఆ ర‌కంగా శ్రుతి హాస‌న్ కూడా కొంత జీవితాన్ని ఆస్వాదించింది. కానీ గ‌త అనుభ‌వాల దృష్ట్యా కుమార్తెల పెళ్లి విష‌యంలో మాత్రం మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌మ‌ల్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

టాక్సిక్ స్టోరీ లీక్1961 గోవా బ్యాక్‌డ్రాప్..

టాక్సిక్ స్టోరీ లీక్1961 గోవా బ్యాక్‌డ్రాప్

 

కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో మరోసారి వెండితెరపై విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకున్న మాస్ అప్పియరెన్స్‌కు ఖచ్చితంగా వైలెన్స్ ఉన్న సినిమానే చేయాలి లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేంతలా. అందుకే.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఎన్నో కథలు విని చివరికి టాక్సిక్ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత ఇండియాలో పెను సంచలనమే సృష్టించింది. కొందరు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అని పొగడ్తలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం మసాలా కంటెంట్ ఏంటి ఈ రేంజ్‌లో ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ సినిమాను ముందుగా మార్చి 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు.

సాధారణంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు అంటే ముంబై అండర్ వరల్డ్, లేదంటే అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరుగుతుంటాయి. కానీ టాక్సిక్ సినిమా కోసం గోవా చరిత్రలోని ఒక క్లిష్ట సమయాన్ని ఎంచుకున్నారు. మన దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉంది. ఆ 14 ఏళ్ల కాలంలో గోవాలో స్మగ్లింగ్ ముఠాలు ఎలా రాజ్యమేలాయి? రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి? అనే అంశాల చుట్టూ ఈ ఫిక్షనల్ డ్రామా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కథ 1940లో మొదలై 1970 వరకు.. అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక సామ్రాజ్యం పుట్టుక, దాని పతనం ఎలా జరిగిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట.
ఈ సినిమాలో యష్ ‘రయా’ అనే పవర్ రోల్‌లో నటిస్తున్నాడు. మొత్తానికి ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ నుంచి.. టీజర్, సాంగ్స్ ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version