*వెలిచాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తిప్పారపు శ్రీనివాస్*
కరీంనగర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో సామాజిక కార్యకర్త 12వ డివిజన్ కు చెందిన నాయకులు తిప్పారపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిప్పారపు శ్రీనివాస్ గతంలో బీఆర్ఎస్ బిజెపి పార్టీలో పని చేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ కు రాజేందర్ రావు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజేందర్ రావు మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలతో సామాజిక సేవ చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న తిప్పారపు శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి నగరపాలక సంస్థ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ప్రజలంతా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని రాజేందర్రావు పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో రాజేందర్ రావ్ ఆధ్వర్యంలో చేరానని తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి మహేష్, రుద్రాక్ష కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
