గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
ప్రతి సమస్య నా ఇంటి సమస్యల భావిస్తా..
నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్
నిజాంపేట : నేటి ధాత్రి
గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ప్రతి సమస్యను నా ఇంటి సమస్యల భావిస్తానని నూతన సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ సంఘం, కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నస్కల్ గ్రామాన్ని నిజాంపేట మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామంలో బస్సు సమస్యను ముందుగానే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని త్వరలోనే బస్సు సౌకర్యం ఈ గ్రామాలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పాతూరి రామాగౌడ్, ఉపాధ్యక్షుడు బక్కన్న గారి లింగం గౌడ్,మాజీ అధ్యక్షులు తీగల ఎర్రగౌడ్, గౌడ సంఘం సభ్యులు, కౌండిన్య యూత్ సభ్యులు ఉన్నారు.
