మల్లన్నపల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం
-ఐదు వార్డులు కూడా ఏకగ్రీవం…
వీణవంక: నేటిదాత్రి;
వీణవంక మండలం మల్లన్నపల్లి గ్రామ సర్పంచ్ గా కలకొండ సరోజన మధుకర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. హుజురాబాద్ డివిజన్ లోనే ఏకైక ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ గా మల్లన్నపల్లి నిలిచింది సర్పంచ్ తో పాటు ఐదు వార్డులు ఏకగ్రీవం కావడం తో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతి ఏర్పడగా రెండో సర్పంచ్ గా సరోజన ఏక గ్రీవం కావడం విశేషం. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ..ప్రజల సహకారం తో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఊరి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రామ ప్రజల సహకారం తో గ్రామ అభివృద్ధి కి తొడ్పాతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
