*కాలువలు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించండి..
*కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటిధాత్రి)
నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజి కాలువలు, రోడ్లపై నిర్మించిన నిర్మాణాలను, మెట్లను తొలగించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం లక్ష్మీపురం, జయనగర్, మునిసిపల్ ప్రైమరీ స్కూల్ తదితర ప్రాంతాలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పలు చోట్ల డ్రైనేజి కాలువలు, రోడ్లపై ర్యాంపులు (మెట్లు) ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త, మురుగునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్కూల్ పై వాలిన చెట్టు కొమ్మలను తొలగించాలని ఉద్యానవన శాఖాధికారికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,డి.ఈ లు రాజు, లలిత,శిల్ప, ఏసిపి లు మధు, పార్వతిప్రియ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.
