కాంగ్రెస్ నాయకుల కు అడ్డగా తహసిల్దార్ కార్యాలయం…

కాంగ్రెస్ నాయకుల కు అడ్డగా తహసిల్దార్ కార్యాలయం.

#కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే శిక్షించాలి.

#ఆత్మ హత్య యత్నానికి ప్రేరేపించిన ఎమ్మార్వో ను తక్షణమే సస్పెండ్ చేయాలి.

#కల్పన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.

#మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

నల్లబెల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వాంకుడోత్ కల్పన సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్గొన్న సంఘటన పై బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక గిరిజన మహిళ ఉద్యోగి పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని అక్రమ పనుల కోసం అధికారులను వేధిస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు నీచమైన రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం సిగ్గుచేటు. గిరిజన మహిళ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించకపోవడం దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాంకుడోత్ కల్పన తనకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రమాదం ఉందని వారు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఎమ్మార్వో కు పలుమార్లు చెప్పినా కూడా ఎమ్మార్వో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజీ పడాలని చెప్పడం ఆమెను మానసికంగా ఎంతగానో కృంగాదీసింది. తోటి ఉద్యోగరాలకు ప్రమాదం ఉందని తెలిసి ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారకుడైన ఎమ్మార్వో ముప్పు కృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయలలో కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుతున్న అధికారులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మండలంలో మైనింగ్, మట్టి మాఫియా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారుల పైన జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రశ్నించిన వారి పైన అక్రమంగా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు. ఇప్పటివరకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న కల్పనను పై ఉన్నతాధికారులు ఎవరు పరామర్శించకపోవడం బాధాకరమని. నిరసన కార్యక్రమాన్ని విరమించాలని నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై గోవర్ధన్ చెప్పినప్పటికీ కూడా శాంతించని బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆర్డీవో వచ్చి బాధితురాలకు భరోసా ఇచ్చేంతవరకు నిరసన కార్యక్రమాన్ని విరమింప చేసే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. పరిస్థితి చేయి దాటి పోతుందని గమనించిన ఎస్సై గోవర్ధన్ ఆర్డీవోతో చరవాణి ద్వారా పెద్ది స్వప్నతో మాట్లాడుతూ కల్పన ఆత్మహత్యయత్నని కి కారకులైన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వగా నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ మేరకు కేసును సుమోటోగా తీసుకొని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వరరావు, గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారామ్ యాదవ్, అమరేందర్, గోనె యువరాజు, మామిండ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, జాటోతు తిరుపతి, మాజీ ఎంపిటిసి లక్ష్మి, ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మాటూరి హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version