త్వరలో రిజర్వేషన్లు ప్రక్రియ ఖరారు కానున్నాయి
సర్పంచుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి:
◆:- యువ నాయకులు షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మన భారతదేశంలో 15-29 గల 371 మిలియన్లకు పైగా యువకులు ఉన్న మన దేశం అనగా మొత్తం జనాభాలో 27 శాతం యువకులే ఉన్నారు. అంటే అత్యధికంగా యువత కలిగిన మన భారతదేశంలో చాలామంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే యువత రాజకీయరంగ ప్రవేశం చేయాలి. యువత రాజకీయం చేసిన రోజు మన దేశంలో చాలామంది అబ్దుల్ కలాంలను చూడవచ్చు. మన స్వామి వివేకానంద చెప్పిన విధంగా ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన వందమంది యువతను నాకు ఇస్తే నేను ప్రపంచాన్ని మార్చేస్తానన్నాడు. కావున యువత తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క మార్పు పల్లెల్లో నుంచి పట్టణం వరకు చేరాలి గల్లి నుండి ఢిల్లీ వరకు చేరాలి.
