కేరళంలో హస్తందే జోరు.. రేవంత్ ప్రచారంతో పెరిగిన ఊపు!

-స్పష్టంగా కేరళలో కనిపిస్తున్న హస్తం హవా.

-గత స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్.

-అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికలు గెల్చుకోబోతున్న కాంగ్రెస్.

-రెండు సార్లు గెలిచిన సిపిఎం మీద తీవ్ర వ్యతిరేకత.

-భూ కుంభకోణాలు, బంగారం కొనుగోళ్లపై ఆరోపణలు.

– సిఎం రేవంత్ ప్రచారంతో ఊపులో హస్తం.

-రెండు రోజుల పాటు సిఎం రేవంత్ విస్తృత ప్రచారం.

-తెలంగాణా లో ఉచిత బస్సు ప్రయాణం కేరళ ప్రజలకు నచ్చింది.

-ఉద్యోగ కల్పన జరిగిన తీరు గురించి చెప్పడం జరిగింది.

-రెండేళ్ల లో చేసి చూపించిన విజయాలు కేరళలోనూ అమలు.

-ప్రజలకు సన్న బియ్యం పతకం పై కేరళలో ఆసక్తి.

-గ్యారంటీల అమలుపై కేరళ ప్రజల నమ్మకం.

-ఎల్ డి ఎఫ్ మీద పెరిగిన వ్యతిరేకత.

-సిఎం. పినరై విజయన్ ప్రభుత్వం మీద అవినీతి ముద్ర.

-కాంగ్రెస్ కూటమికి 100 సీట్లు ఖాయమని తెలుస్తోంది.

-సామాన్యులను ఎవరిని పాలకరించినా ఒకటే మాట.

-ఈ సారి యూ డి ఎఫ్ పక్కా.

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 గ్యారెంటీ హమీలు అంటేనే గెలుపుకు మార్గాలు అని మరోసారి కేరళలో రుజువుకాబోతోంది. ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడు మీద వుంది. గత పది సంవత్సరాల కాలంలో ఎల్‌డిఎఫ్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. దానికి తోడు కేరళ కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి హమీ ఇచ్చిందంటే తప్పకుండా అమలు చేసి తీరుతారన్న నమ్మకం దేశ వ్యాప్తంగా వుంది. అదే నమ్మకం తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారు. అంతకు ముందు కర్నాటకలోనూ గెలిపించారు. ఈ స్పూర్తితో కేరళలోనూ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్దంగా వున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత కొంత కాలంగా కేరళ రాజకీయాల మీద దష్పిపెట్టారు. అక్కడి ప్రజల జీవన విధానం మీద, అక్కడి ప్రభుత్వం పనుల మీద అద్యయనం చేశారు. కేరళ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నదానిపై కూడా సిఎం. రేవంత్‌రెడ్డి దష్టిపెట్టారు. అందుకోసం ఆ తాను అదికారంలోకి వచ్చిన తర్వాత సిఎం. రేవంత్ రెడ్డి కేరళలకు రెండు మూడుసార్లు వెళ్లివచ్చారు. అక్కడ కాంగ్రెస్ గెలుపు అవసరమైన సూచనలు కూడా చేసి వచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివద్ది కేరళ ప్రజలకు తెలిసేలా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అక్కడి పత్రికల్లో కూడా తెలంగాణ ప్రగతి గురించి సమాచారం చేరేలా కూడా చొరవ తీసుకుంటూ వచ్చారు. అది కేరళలో కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా చేసిందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల అమలు గురించి కేరళ ప్రజలు తెలుసుకునేలా అక్కడి మీడియా ద్వారా తెలంగాణ వార్తలు తెలిసేలా చేశారు. అక్కడి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా అభివద్ది చెందుతోందన్న దానిపై అక్కడి ప్రజలకు వివరించే ప్రయత్నం బలంగా చేశారు. తెలంగాణ బ్రాండ్ అంటే ఏమిటన్నదానిపై కూడా అక్కడి నాయకులు ప్రజలకు పదే పదే వివరిస్తూ వస్తున్నారు. తెలంగాణలో అమలు విజయవంతంగా అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై అక్కడి ప్రజలకు ఆసక్తి నెలకొనేలా చేశారు. రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం కేరళ ప్రజలకు ఆసక్తి నెలకొనేలా చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా అమలు జరుగుతున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా భద్రత గురించి కేరళలో చర్చలు జరిగాయి. ఇప్ప్పుడు ఎన్నికల సందర్భంగా కేరళలోనూ కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ ఉచిత ప్రయాణం హమీ అందిస్తున్నారు. మహిళలనుంచి మంచి స్పందన వస్తోంది. అయితే స్టార్ క్యాంపెనర్‌గా సిఎం. రేవంత్‌రెడ్డి ఇటీవల రెండు రోజుల పాటు విసతమైన ప్రచారం నిర్వహించారు. అప్పటికే తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు తెలిసిన కేరళ ప్రజలు సిఎం. రేవంత్ సభకు విపరీతంగా తరలి వచ్చారు. సిఎం. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆసక్తిగా విన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలకు మంచి కేరళలో అమలు చేయనున్న పథకాలపై రేవంత్ చెబుతున్నప్ప్పుడు ప్రజలు కేరింతలు కొట్టారు. రేవంత్ రోడ్‌షోలకు కూడా ప్రజలు తండోపతండాలుగా హజరయ్యారు. తెలంగాణ బ్రాండ్ ఎలా పెరిగిందో, రేవంత్ సర్కారు గత రెండు సంవత్సరాల కాలంలో చేసిన అభివద్దిని గురించి ప్రజలకు వివరించారు. రెండేళ్లలో రైతులకు రేవంత్ సర్కారు చేసిన మేలును గురించి చెప్పడం జరిగింది. ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం గురించి చెప్పినప్ప్పుడు అక్కడి రైతులు ఎంతో ఆసక్తిగా విన్నారు. దేశంలో ఎప్ప్పుడూ, ఏ ప్రభుత్వం చేయని గొప్ప పని రేవంత్ సర్కారు చేసిందని కేరళ ప్రజలు కూడా చెప్ప్పుకోవడం జరిగింది. రైతు భరోసాతోపాటు, పండిన పంటలకు గిట్టు బాటు ధరలు వంటి అనేక అంశాలు రేవంత్ చెబుతున్నప్ప్పుడు ప్రజలు ఎంతో ఆసక్తిగా విన్నారు. పైగా రైతులు పండించిన పంటలకు క్వింటాలకు అదనంగా ఇస్తున్న బోనస్ గురించి తెలుసుకొని రైతు రాజ్యం తెలంగాణలో రేవంత్ సర్కార్ తెచ్చిందని కేరళ ప్రజలు చెప్ప్పుకుంటున్నారు. మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల అమలు గురించి రేవంత్ చెబుతున్నప్ప్పుడు అక్కడి మహిళలు ఎంతో ఆసక్తిగా వినడం జరిగింది. వయసు మళ్లిన వారికి తెలంగాణలో ఇస్తున్న పించన్లను గురించి కూడా చెప్పారు. తెలంగాణ కంటే మరో వెయ్యి అదనంగా కేరళలో ఇవ్వడం జరుగుతుందని రేవంత్ చెబుతున్నప్ప్పుడు ప్రజలు ఈలలు, చప్పట్లు కొట్టారు. రేవంత్ ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా పెద్దఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా స్వాగతాలు పలికారు. రేవంత్‌రెడ్డికి అడుగడుగునా స్వాగతాలు చెప్పారు. ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ బలంగా మారింది. రేవంత్‌రెడ్డి ప్రచారానికి వెళ్లిన తర్వాత కేరళలో మరింత బలంగా మారిందని కూడా అంటున్నారు. రేవంత్ ప్రచారానికి ముందు, తర్వాత అని అక్కడి కాంగ్రెస్ నాయకులు చెప్ప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి చేసిన ప్రచారం మూలంగా కేరళలో వార్ వన్‌సైడ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా వున్నాయని కాంగ్రెస్ నాయకులు చెప్ప్పుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిని కొనియాడుతున్నారు. పదేళ్ల పాలనలో ఎల్డీఎఫ్ కేరళ అన్ని రంగాలలో వెనుకబడిపోయిందన్న మాటలే వినిపిస్తున్నాయి. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివద్దిని కొనసాగించాల్సిన సమయంలో ఎల్డీఎఫ్ అవినీతిలో కూరుకుపోయిందని అంటున్నారు. అయితే సిఎం. రేవంత్‌రెడ్డి కేరళ ఎల్డీఎఫ్ మీద చేసిన ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం షేక్ అయ్యిందనే చెప్పాలి. లేకుంటే కేరళ సిఎం. పినరయ్ విజయన్ ప్రత్యేకంగా పదే పదే సిఎం. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించడమే ఇందుకు తార్కాణం. పైగా ప్రత్యేకంగా పినరయ్ విజయన్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కేరళలను కుదుపు కుదిపేశాయని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. కేరళలో కాంగ్రెస్ ఇచ్చిన హమీలు కూడా ఎంతో ప్రజలను ప్రభావితం చేస్తున్నాయనే చెప్పాలి. గ్యారెంటీల విషయానికి వస్తే ఐదు ఇందిరా హమీలు ప్రకటించారు. కేరళలోని ప్రతి మహిళకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. తెలంగాణలో ఈ పధకం ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాలేజీలలో చదువుకునే ప్రతి విద్యార్ధినికి నెలకు రూ.1000 రూపాయల పారితోషికం అందించనున్నారు. సామాజిక భద్రత పించన్లను రూ.2000 నుంచి రూ.3000లకు పెంచి అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉమెన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వరకు ఆరోగ్య భీమా అమలు చేయనున్నారు. తెలంగాణలో ఇది రూ.10లక్షలకు వరకు అమలు చేస్తున్నారు. సొంతగా వ్యాపారాలు సాగించాలనుకునే యువతకు రూ.5లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామంటున్నారు. కేరళలో రైతులు రబ్బరు సాగును విసతంగా చేపడుతుంటారు. ఆ రబ్బరు కిలోకు రూ.250 రూపాయల మద్దతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ ఖచ్చితమైన హమీ ఇస్తూ వుంది. ఈ హమీలపై సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన విసత ప్రచారం మూలంగా ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మీద మరింత భరోసా కల్గిందని అక్కడి ప్రజలు చెప్ప్పుకుంటున్నారు. తెలంగాణలో లాగా కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది.. మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకొని ముందంజలో వుంది. అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెల్చుకుంటుందని సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version