కుంభ’కు ‘వారణాసి’కి లింక్ ఏంటి?
ఈ మూవీలో ఇప్పటికే విలన్ ‘కుంభ’ను పరిచయం చేస్తూ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి. పోస్టర్లో పృథ్విరాజ్ గంభీరంగా, క్రూరంగా, దివ్యాంగుడిలా కనిపిస్తున్నారు. హైటెక్ వీల్ ఛైర్లో కూర్చోని ఉన్నారు. ఆ కూర్చీ ఆర్టిఫిషియల్ రొబోటిక్ టెక్నాలజీదిగా ఉంది. కుర్చీకి నాలుగు చేతులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే ఆ హ్యాండ్స్‌కు సూపర్ పవర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎలా అంటే అందులో ఒక చేయి నార్మల్‌గా ఉంటే, ఇంకో చేయికి డిఫరెంట్‌గా రెడ్ కలర్లో సూపర్ పవర్ ఉన్నట్లు ఉంది. దీని బట్టి చూస్తే విలన్ బలం అంతా ఆ చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. అలానే కుంభకు పక్షవాతం లాంటిదేదైన వచ్చి ఉండవచ్చని, లేదా జెనెటిక్ డిసార్డర్ రావొచ్చని ఫ్యాన్స్ ఇప్పుట్నుంచే ఊహాగనాల్లో తేలిపోతున్నారు.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ డిఫరెంట్ జాన్రాలో, విలన్ నార్మల్ లుక్‌లో కాకుండా నెగెటివ్ పాత్రను చాలా డిఫరెంట్‌గా, స్టైల్ డిజైన్ చేశారు. దర్శకుడి ఆలోచనలను ఎవ్వరు అందుకోలేరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కూర్చీలో కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, పవర్ఫుల్ డామినేటింగ్ రోల్లో అతని పాత్రను యూనిక్‌గా డిజైన్ చేశారు జక్కన్న. అయితే, ఈ లుక్‌పై ట్రోలింగ్స్ కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు సూర్య ’24’ మూవీలో ‘ఆత్రేయ’ రోల్ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే, ‘క్రిష్ 3’లో వివేక్ ఒబెరాయ్ ‘కాల్’ రోల్‌ను పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజమౌళిని తక్కువ అంచనా వెయ్యొద్దని… ఒక్క ఫ్రేమ్‌తోనే సినిమా మొత్తం మారిపోతుందని అంటున్నారు. ఈ మూవీ టైటిల్ ‘వారణాసి’ అని ఫిక్స్ చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ‘కుంభ’కు, వారణాసికి లింక్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. హీరో మహేష్ బాబు పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందనే ప్రచారం సాగుతుండగా… రామాయణంలో సుగ్రీవుడి పిడిగుద్దులతో కుంభకర్ణుడి కుమారుడు కుంభుడు మరణిస్తాడు. ఇక సంజీవని అన్వేషణలో సాహస యాత్ర సాగించే హీరో ‘కుంభ’ను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
