నీ పక్కన లేకపోవడం ఇదే మొదటిసారి…      

నీ పక్కన లేకపోవడం ఇదే మొదటిసారి      

 

మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌ పుట్టినరోజు నేడు. దీనిని ఉద్దేశించి మహేశ్‌ ట్వీట్‌ చేశారు

మహేశ్‌బాబు (Mahesh Babu) కుమారుడు గౌతమ్‌ Gowtham Ghattamaneni) పుట్టినరోజు నేడు. దీనిని ఉద్దేశించి మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఈ బర్త్‌డేకి నిన్ను మిస్‌ అవుతున్నా’ అంటూ కుమారుడు గౌతమ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు.  ‘ప్రతిసారీ నీ పుట్టినరోజు నీ పక్కనే ఉంటాను.. ఈసారి లేకపోవడం కాస్త బాధగా ఉంది’ అని మహేశ్‌ ఎమోషనల్‌ అయ్యారు. గతంలో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 19వ వసంతంలోకి అడుగుపెట్టిన గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’ అని విషెస్‌ తెలియజేశారు. మహేశ్‌ అభిమానులు పలువురు నెటిజన్లు గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రస్తుతం మహేశ్‌ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.    ఇప్పటికే మూడు షెడ్యూళ్ల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ను నైరోబి, టాంజానియాల్లో ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. 

టాంజానియాలో చిత్రీకరణకు సిద్ధం

 

టాంజానియాలో చిత్రీకరణకు సిద్ధం

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం (‘ఎస్‌ఎ్‌సఎంబీ 29’- వర్కింగ్‌ టైటిల్‌) కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో టాంజానియాలోని సెరెంగెటి నేషనల్‌ పార్క్‌లో చిత్రీకరణ కోసం యూనిట్‌ సన్నద్ధమవుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్‌సుకుమారన్‌పై ఈ షెడ్యూల్‌ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత దక్షిణాఫిక్రాలో కొంత భాగం చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని యాక్షన్‌ ఘట్టాలను తొలుత కెన్యాలో చిత్రీకరించాలనుకున్నా అక్కడున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో చిత్రబృందం టాంజానియా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

 

మ‌రోసారి.. మహేశ్‌ బాబుకు లీగ‌ల్ నోటీసులు

 

మ‌రోసారి.. మహేశ్‌ బాబుకు లీగ‌ల్ నోటీసులు 

రియల్‌ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేశ్‌బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

 

ఓ రియల్‌ ఎస్టేట్ సంస్థ సాయిసూర్య డెవలపర్స్ (Sai Surya Developers)కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీనటుడు మహేశ్‌బాబుకు (Mahesh Babu) తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సదరు సంస్థ నిర్వాహకులు లేఔట్‌లో అన్ని అనుమతులున్నాయని ప్రచారం చేసుకున్నారని, మహేశ్ బాబు ఫొటో ఉన్న బ్రోచర్‌లోని వెంచర్‌లో ఉన్న ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాటు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలితోపాటు మరో వ్యక్తి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి బాలాపూర్‌ గ్రామంలో చెరొక ప్లాటు కొనుగోలుకు రూ.34.80 లక్షల చొప్పున చెల్లించామన్నారు.ఆ తర్వాత అసలు లేఔట్‌ కూడా లేదని తెలుసుకొని తమ డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సంస్థ ఎండీ సతీష్‌ చంద్రగుప్తా పలు వాయిదాల్లో చెరి రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారని బాధితులు పేర్కొన్నారు.

 

మహేశ్‌బాబు ఫొటో ఉన్న బ్రోచర్‌ను చూపుతూ లేని వెంచర్‌లో ప్లాట్లను విక్రయించి సాయిసూర్య డెవలపర్స్ (Sai Surya Developers) తమను మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మెస్సర్స్‌ సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్‌ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు సోమవారం వ్యక్తిగతంగా గానీ న్యాయవాదుల ద్వారా గానీ హాజరు కావాల్సి ఉంది.

 

ఇదిలాఉంటే.. సాయి సూర్య డెవలపర్స్‌ ప్రకటనల్లో నటించినందుకు మహేశ్‌ బాబుకు రూ.5.9 కోట్లు పారితోషికం చెల్లించారు. అందులో రూ.2.5 కోట్లు నగదు రూపంలో ఇచ్చారు. ఈ మ‌ధ్య‌జరిగిన ఈడీ సోదాల్లో ఈ విషయం వెల్లడికావడంతో మహేశ్‌బాబును విచారణకు రావాలని ఈడీ నోటీసు జారీ చేయ‌గా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్‌బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి మ‌హేశ్‌కు నోటీసులు ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version