2013 భూ సేకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి..

2013 భూ సేకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి

చిన్న కాలేశ్వరం ఇరిగేషన్ కాల్వల నిర్మాణం కోసం చేసిన ప్రాథమిక సర్వేను రద్దుచేసి “రీ సర్వే” నిర్వహించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను సవరించి రైతుల మధ్య ప్రస్తుతం నడిచే క్రయవిక్రయాలు (అమ్మకం కొనుగోలు )అనుగుణంగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్లు విలువ చెల్లించాలని భూసేకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ కాలువల నిర్మాణం కింద పోయే మహాముత్తారం మండలానికి చెందిన 14 గ్రామాల భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి 14 గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు వినతి పత్రం అందజేశారు.
వారు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ కాల్వల నిర్మాణంలో భాగంగా ప్రాథమిక సర్వే నిర్వహించే క్రమంలో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వని కారణంగా అనేక అవకతవకలు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సంబంధం లేకుండా సర్వే నిర్వహించడం వల్ల అనేకమంది రైతుల పేర్లు భూసేకరణ లిస్టులో నమోదు కాలేదని రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణాన్ని సేకరించి తక్కువ భూమిస్తీర్ణమే భూసేకరణ లిస్టులో నమోదు చేశారని మరియు భూమి సేకరించగా వ్యవసాయానికి నిరుపయోగంగా మిగిలినటువంటి భూమిని కూడా పరిగణలోకి తీసుకొని దానికి నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ చాలా తక్కువ ఉండడం వలన రైతులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను సవరించి రైతుల మధ్య జరుగుతున్న క్రయవిక్రయాలకు (అమ్మకాలు కొనుగోలు) కనగానంగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ( ప్రస్తుత ధర 16 లక్షల నుండి 20 లక్షల వరకు రైతుల మధ్య నడుస్తుంది) దీనికి నాలుగు రెట్లు చెల్లించాలని ఈ విశయల పైన , సరైన స్పష్టత రావాలని అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఏ విషయం పై కూడాఅభ్యంతరాలను నివృత్తి చేసే విధంగా గ్రామ సభలో అధికారులు మాట్లాడలేదని ఆ రైతులు వాపోయారు, అదే విషయంపై జిల్లా కలెక్టర్ కి అందజేసి వారి డిమాండ్స్ ని కలెక్టర్ కి వివరించారు. ప్రభుత్వం రైతుల భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని వారు మండిపడ్డారు, వెంటనే రీ సర్వే నిర్వహించి మోకా మీదికి రైతులను పిలిచి రైతుల ముందే సర్వే చేయాలని అన్నారు, రైతు నుంచి సేకరించిన పూర్తి విస్తీర్ణానికి పరిహారం చెల్లించాలని, రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను రైతుల మధ్య నడుస్తున్న కావిక్రయాల ధరకు సమానం చేసి నాలుగు రెట్లు చెల్లించాలని అన్నారు ఈ విషయాల పట్ల స్పష్టత రాకుండా పనులు ప్రారంభిస్తే ఊరుకునేదే లేదని , భూములు కాలువల నిర్మాణం కోసం ఇవ్వమని తెగేసి చెప్పారు
ఈ కార్యక్రమంలో పొలం రాజేందర్, పోలరం సర్పంచ్ అంబాల రాజబాబు, వేల్పుల తిరుపతి, వేల్పుల వెంకటి, ముక్కెర శ్రీకాంత్, ముక్కిర లక్ష్మీనారాయణ, చీరాల జగపతిరావు, వేముల లింగయ్య, వేముల శ్రీనివాస్, వజినలల్లి గ్రామ సర్పంచ్ పరిషవేణి మహేష్, పోలం మల్లయ్య, పొలం రాజ్ కుమార్, రామినేని సురేందర్, గొరిగ కిరణ్ కుమార్, పండరి పద్మ, గొరిగ పద్మ, పోలం పోచయ్య, మంద శ్రీను,ఆతుకూరి శ్రీదర్ మహా ముత్తారం మండలంలోని 14 గ్రామాలకు చెందిన భూనిర్వాసితులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version