ఐకెపి సెంటర్స్ లో ఇంచార్జిల హావా.
పైసలు ఇస్తే లోడ్ లేకుంటే లేదు వరి, మక్కల కొనుగోలు కేంద్రాల్లో అక్రమ వసూళ్లు
అక్రమ వసూళ్లలో అధికారుల వాటా ఎంత?.
అవస్థలుపడుతున్న రైతులు
ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
టేకుమట్ల మండలంలోని ఐకెపి సెంటర్స్ లో సెంటర్ ఇంచార్జిలు హవా చేస్తున్నారని, వరి, మక్కల కొనుగోలు కేంద్రాల్లో పైసలు ఇస్తేనే రైతుల దాన్యాన్ని లోడ్ చేస్తున్నారని, పైసలు ఇవ్వకుంటే రైతుల దాన్యాన్ని లోడ్ చేయకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మార్కెటింగ్ శాఖ అధికారులకు కూడా వాటా ఇస్తున్నామని బెదిరిస్తున్నారనిఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
,సెంటర్ ఇంచార్జిలు మార్కెటింగ్ అధికారుల పేరు చెప్పి మరీ రైతుల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎం చేయలేని అయోమయ పరిస్థితుల్లో రైతులు పైసలు ఇస్తున్నారని, ఇంత తతంగం జరుగుతున్న సంబంధిత మార్కెటింగ్ అధికారులు నిమ్మకు నీరేత్తి నట్లు వ్యవహరిస్తున్నారని, అక్రమ వసూళ్లలో అధికారుల వాటా ఎంత? అని ప్రశ్నించారు.వర్షాకాలం దగ్గరికి వచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం మూలంగా రైతులు అనేక అవస్థలుపడుతున్నారని ఇకనైనా స్థానిక శాసనసభ్యులు,జిల్లా కలెక్టర్, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి ఈ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో చిలుక కుమార్, గజ్జి రాజయ్య, దాసారపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..
