బ్రిడ్జికి మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎన్నాళ్ళు ఇలా!

బ్రిడ్జికి మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎన్నాళ్ళు ఇలా!

ఇబ్బంది పడుతున్న రైతులు గ్రామస్తులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేటమండలం నేరే డుపల్లి గ్రామ ప్రజలు బ్రిడ్జి కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా అధికారులకు చెప్పుకొస్తున్న తప్ప నేటికీ నూతన బ్రిడ్జి నిర్మాణం చేప ట్టలేదు నేటి పల్లె గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. మండలానికి రావాలంటే చుట్టూ గ్రామాలు తిరిగి రావలసిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ఏటా అధికారులు ప్రజాప్రతినిధు లకు వేడుకుంటున్న ఫలితం లేకపోతుందని ప్రజలు వాపో తున్నారు.

ఇబ్బంది పడుతున్న రైతులు, గ్రామస్తులు

శాయంపేట మండలం పత్తి పాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు అనేది గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు మండ లానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపో వడంతో గ్రామాల ప్రజలు ఎదు రుచూస్తున్నారు ఎన్నికలసమ యంలో అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు బ్రిడ్జి నిర్మాణా నికి హామీ ఇవ్వడం ఆ తర్వా త విస్మరించడం పరిపాటిగా మారింది మండల గ్రామానికి అతి సమీపంలో ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించక పోవడం ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు గత ప్రభు త్వం రోడ్డు మార్గం వాగు దాకా వేసి కరెంట్ అన్ని ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు

ఇప్పుడైనా పూర్తి చేస్తారా!
ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురు చూపు లు మిగిలాయి ఈసారి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఎంతగా ఆశగా ఎదు రుచూస్తున్నారు ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కొని ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version