కార్తీ కోసం బోయపాటి ‘హై-వోల్టేజ్’ స్క్రిప్ట్!

కార్తీ కోసం బోయపాటి
‘హై-వోల్టేజ్’ స్క్రిప్ట్!

 

 

 

 

బాక్సాఫీస్ వద్ద ‘మాస్’ అనే పదానికి సిసలైన ట్రేడ్ మార్క్.. బోయపాటి శ్రీను! ఆయన సినిమాల్లో హీరో నడిచి వస్తుంటే థియేటర్లలో స్పీకర్లు రీసౌండ్ ఇవ్వాలి, విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి, బాక్సాఫీస్ బేస్ మెంట్ కదిలిపోవాలి. థియేటర్లో విజిల్స్ మోతతో చెవులు చిల్లులు పడాలి.. ఇదీ బోయపాటి సినిమా అంటే అని సగటు ప్రేక్షకుడికి కలిగే ఫీలింగ్ ఇది. ఒక సాదాసీదా సీన్‌ను కూడా తనదైన హై-వోల్టేజ్ ఎలివేషన్లతో విజువల్ వండర్‌గా మార్చడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘భద్ర’ నుంచి మొన్నటి ‘అఖండ-2’ వరకు బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. హీరోను పవర్‌ఫుల్ దైవ స్వరూపంగానో, ఉగ్రరూపంగానో చూపించడంలో బోయపాటి శైలే వేరు.

అఖండ-2′ తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేస్తారనే ఉత్కంఠకు తెర దించుతూ ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ల పేర్లు వినిపించినా తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో బోయపాటి జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్తీకి సరిపడే ఒక పక్కా మాస్ యాక్షన్ కథను బోయపాటి సిద్ధం చేశారని, ప్రాథమిక చర్చలు కూడా ముగిశాయని టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కార్తీ నటనలోని వైవిధ్యం, బోయపాటి యాక్షన్ మేకింగ్ తోడైతే వెండితెరపై ఒక కొత్త రకమైన మాస్ జాతర మొదలవ్వడం ఖాయం. కార్తీ వంటి హీరోను బోయపాటి తన పవర్‌ఫుల్ డైలాగులు, ఊహకందని ఎలివేషన్లతో ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రేజీ కాంబోపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తే గనుక సౌత్ ఇండియాలో ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.a

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version