జెడ్ పి హెచ్ ఎస్ మొగుళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T141108.083.wav?_=1

జెడ్ పి హెచ్ ఎస్ మొగుళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ
 ” ఎన్. సి.సి శిక్షణ శిబిరంలో   
 —  ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

    జులై 24 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎన్. సి.సి వరంగల్ గ్రూపు
పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్  కాల్నల్ సెంథిల్ రాముదరై మరియు పరిపాలన అధికారి లెప్టునేoట్ కల్నల్ రవి సొనరే  గారి నేతృత్వంలో కంబైండ్ ఆనవల్ ట్రైనింగ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు.
ఈ క్యాంపులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగుళ్లపల్లి నుండి 5గురు అమ్మాయిలు ,10 మంది అబ్బాయిలు,మొత్తం15 మంది విద్యార్థులు పాల్గొని పది రోజులపాటు జరిగిన వివిధ కార్యక్రమాలు అనగా డ్రిల్, ఆయుధాల వినియోగం, వ్యక్తిత్వ వికాసం , ఆటలు,
సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యూహాత్మక దాడుల విధానాలు, శత్రువు శిబిరాల ధ్వంసం వంటి, వాటిని ప్రాక్టికల్ గా ఈ శిక్షణలో పొందారని,
ఈ శిక్షణలో జిల్లా పరిషత్తు మొగుళ్ళపల్లి పాఠశాల విద్యార్థి సీనియర్, పురాణం వీరమల్లు, ఫైరింగులో ప్రథమ స్థానం, ఖో-ఖో లో మెరుగు సంజయ్ ప్రథమ స్థానం, పొందారని డ్రిల్ లో కూడా మంచి ప్రతిభ చూపారని పాఠశాల

పింగిళి విజయపాల్ రెడ్డి, మాట్లాడుతూ ఎన్. సి.సి ద్వారా దేశభక్తి , క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, జాతి పట్ల గౌరవం, మానవత్వ విలువలతో పాటు శారీరక, మానసిక అభివృద్ధి సాధించవచ్చునని
అదేవిధంగా ఈ శిక్షణ ద్వారా అందించే సర్టిఫికెట్
1 శాతం రిజర్వేషన్, విద్య , ఉద్యోగాలలో ముందుకు వెళ్ళుటకు ఉపయోగపడుతుందని , పాఠశాల విద్య లోనే కాదు
జాతీయస్థాయిలో భద్రత వ్యవస్థకు అవసరమైన శిక్షణను పొంది అద్భుతంగా రాణిస్తున్నారని, ప్రశంసించారు
ఈ విధంగా మొగుళ్ళపల్లి పాఠశాలకు మొదటి బ్యాచ్, ప్రథమ స్థానం పొందుట ఎంతో గర్వకారణమని మునుముందు వీరిని ఆదర్శంగా తీసుకొని మంచి ఫలితాలు సాధించాలని ప్రతిభ చూపిన విద్యార్థులను అందుకు శిక్షణ అందించిన ఎన్ సి.సి అధికారి రాజయ్యను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ప్రముఖులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో   ఉపాధ్యాయులు 
టి.వెంకన్న ,వై.సురేందర్, ఏ.వీ.ఎల్ కల్యాణి, బి.కుమారస్వామి కె.ప్రవీణ్, ఎం.రాజు,పి.లలిత ,డిపద్మ ,వై. శ్రీకల
ఆర్ .చందర్, అటెండర్,వేణు, సీనియర్ వీరామల్లు, ఎన్.సి.సి విద్యార్థులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version