ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
నర్సంపేట బ్రాంచ్ జోనల్ లో ప్రథమ స్థానంలో నిలుపాలి
బ్రాంచ్ మేనేజర్ గోపి కిషోర్.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బ్రాంచ్ మేనేజర్ గోపికిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యాలయ సిబ్బంది,అధికారులు,ఏజెంట్లు, యూనియన్ల ప్రతినిధులతో నిర్వహించిన గణతంత్ర వేడుకలను బ్రాంచ్ మేనేజర్ గోపికిషోర్ జాతీయ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బి.ఎం మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అగ్రస్థానంలో నిలుస్తున్నదని పేర్కొన్నారు.అత్యుత్తమ పాలసీలు,ప్రిమియంలో జోనల్ స్థాయి లెవెల్ లో అగ్రస్థాయిలో నిలిచి నర్సంపేట బ్రాంచ్ గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్బంగా మేనేజర్ కోరారు.అనంతరం గంటత దినోత్సవ వేడుకల కాంపిటీషన్లో అర్హులైన ఏజెంట్లను మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వీ.వీ.వీ సాయి, ఉన్నతాధికారులు లక్ష్మా నాయక్, శ్యాంసింగ్, రాములు నాయక్,సతీష్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఐశ్వర్య,రమేష్,వినోద్,ఎల్ఐసి ఏఓఐ బ్రాంచ్ అధ్యక్షుడు పొనుగోటి సుధాకర్ రావు,liafi వరంగల్ డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్,బ్రాంచ్ అధ్యక్షుడు
రాక రాజలింగం గౌడ్,ఎల్ఐసి ఏఓఐ బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్,ఎల్ఐసి ఏఓఐ జోనల్ నాయకుడు మొద్దు రమేష్,సీనియర్ నాయకుడు వల్లాల శ్రీహరి గౌడ్, మోహన్ రెడ్డి,వీరారెడ్డి,రవి కుమార్,సాంబరాతి శ్రీనివాస్,రాంబాబు,రమణాచారి,రాజేశ్వర్ రావు,ఎల్ఐసి ఏఓఐ మీడియా కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్,బానోతు చందు నాయక్,అమ్రు,బిక్షపతి,పవన్ కుమార్,శ్రీధర్ రాజు,చంద్రమౌళి,సోమయ్య,బాల్య,రామయ్య తదితరులు పాల్గొన్నారు.
