జహీరాబాద్: సర్పంచ్ పదవులకు 154 నామినేషన్లు దాఖలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. ఎంపీడీఓ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సర్పంచ్ స్థానాలకు మొత్తం 154 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం వరకు కొనసాగింది. ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి, తుది జాబితాను విడుదల చేస్తారు.
ముగిసిన రెండో విడత నామినేషన్లు
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం మండల పరిధిలోని, 33 గ్రామ పంచాయతీలకు, సర్పంచ్, మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు, రెండో విడత నామినేషన్లు, ఆదివారం ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రానికి ముగిశాయి. ఝరాసంగం మండలంలోని 33 గ్రామపంచాయతీలకు, సర్పంచ్ పదవి కొరకు 170 మంది, మరియు 288 మంది వార్డు సభ్యులకొరకు 618 మంది నామినేషన్లు సమర్పించినట్లు, ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి, మంగళవారం రాత్రి, విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.
