చెట్టుకొమ్మ విరిగి పడి వ్యక్తి దుర్మరణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేకాపూర్ గ్రామంలో చెట్టు నరికే పనికి వెళ్లిన అశోక్ (45) అనే వ్యక్తి, చెట్టు కొమ్మ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో, చెట్టు కోస్తుండగా కిందపడిన కొమ్మ అశోక్ తలకు బలంగా తగిలి తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
