ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కంజర డప్పులు వితరణ
గుండాల,నేటిధాత్రి :
నేతకాని కుల సంఘం గుండాల మండల కమిటీకి ప్రముఖ వ్యాపారవేత ఆర్యవైశ్య సంఘం గుండాల మండలం అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పది కంజర డప్పులు వితరణ చేశారు. ఈ సందర్భంగా నేతకాని సంఘం మండల అధ్యక్షులు నిత్యానందం మాట్లాడుతూ నేతకాని కుల సంఘానికి 10 డబ్బులను అందజేసినందుకు మానాల వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మానాల ప్రణీత్ వాసవి క్లబ్ అధ్యక్షులు మానాల శ్రవణ్ కుమార్,తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, మానాల ఉపేందర్, గోలి కిరణ్ మరియు నేతకాని కుల సంఘం నాయకులు గాంధర్ల నిత్యానందం, జనగం అశోక్,మల్లయ్య, పాపయ్య,సాయిలు, రమేష్,వినయ్, రామటెంకి అనిల్ కుమార్ ,చెన్నూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
