షాకీర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థుల
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామ శివారులో ఉన్న సుల్తాన్ హైమద్ దర్గాను మిత్రుడు షాకీర్ మరియు వారి కుటుంబ సభ్యులు పునరుద్ధరించినందుకు సింగీతం గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సింగితం గ్రామ సర్పంచ్ కె. శ్రావణి నిరంజన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆధునికీకరణ కార్యక్రమానికి షాకీర్ మరియు వారి కుటుంబం అందించిన సహకారాన్ని గ్రామస్తులు ప్రశంసించారు.
సింగితం గ్రామంలో ‘ఊర గంధం’ మహోత్సవం ఘనంగా జరిగింది
సింగితం గ్రామంలో హజరత్ సుల్తాన్ అహ్మద్ షా ఉర్సు (జాతర) సందర్భంగా, నిన్న రాత్రి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ అధ్యక్షతన ‘ఊర గంధం’ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, స్థానిక ఎస్ఐ చైతన్య కిరణ్, ఉప సర్పంచ్ పెద్దగొల్ల మహేష్,బిఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు, నిర్వాహకులు, వార్డు సభ్యులు, నాయకులు, మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
