హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో.. 151వ వారం అన్నదాన కార్యక్రమం….
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
ఈ సంధర్భంగా సుమారు 2500 మంది పేదప్రజలు పాల్గొని అన్నసమారాధన గావించారు. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి కడుపునిండ భోజనం చేస్తున్నామని పలువురు పేద ప్రజలు తెలిపారు. రోజంతా కష్టపడితేగాని పూటగడవదు, కాని ప్రతి వారం ఇక్కడ మాత్రం ఉచితంగా భోజనం లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ ఎ ండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
