స్లమ్‌డాగ్’పై హాట్ డిబేట్ పూరీ @ డూ ఆర్ డై

స్లమ్‌డాగ్’పై హాట్ డిబేట్
పూరీ @ డూ ఆర్ డై

పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు ఈయన డైలాగ్స్ బాక్సాఫీస్ ని ఏ రకంగా చీల్చి చెండాడేవో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అలాంటి పూరి నుండి జస్ట్ సినిమా అనౌన్స్ అయితే చాలు.. షూటింగ్ మొదలవ్వకముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేవి. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్ తోడున్నా, టబు లాంటి సీనియర్ స్టార్ ఉన్నా.. ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాకు ఓటీటీ బయ్యర్లు ముఖం చాటేస్తుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయిపోయింది.

పూరీ మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీసింది ‘లైగర్’. కేవలం సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు, ఆ తర్వాత జరిగిన డిస్ట్రిబ్యూటర్ల గొడవలు పూరీ బ్రాండ్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఇప్పుడు ఓటీటీ సంస్థలు “కంటెంట్ చూశాకే.. రేటు చెబుతాం” అంటూ కండిషన్స్ పెడుతున్నాయట.

నిజానికి గ్లామర్, గన్స్, గ్యాంగ్‌స్టర్స్.. ఇవే పూరీ జగన్నాథ్ బలం. కానీ ఈసారి అందుకు భిన్నంగా స్లమ్ ఏరియా బ్యాక్‌డ్రాప్, బిచ్చగాడి పాత్ర చుట్టూ కథను తిప్పారని ఇన్ సైడ్ టాక్. ఇక సినిమాని మే 2026 నాటికి రెడీ చేయాలనే టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారట. కానీ పూరీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ ‘రా అండ్ రస్టిక్’ జోనర్‌లో వర్కవుట్ అవుతాయా లేదా? అనే డౌట్స్ బయ్యర్లలో బలంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది.

ఇక సంవత్సరాల తరబడి సినిమా షూటింగులు జరుపుకుంటున్న ఈ రోజుల్లో స్లమ్‌డాగ్ ని కేవలం 5 నెలల్లో కంప్లీట్ చేశాడంటే పూరిని మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన పూరీ జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం డూ ఆర్ డై అన్నట్టుగానే ఉంది. చూడాలి బాక్సాఫీస్ వద్ద స్లమ్‌డాగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.

మెగా హీరోలకు దిష్టి? బ్యాక్ టు బ్యాక్ సర్జరీలు కారణం ఇదేనా?

మెగా హీరోలకు దిష్టి?
బ్యాక్ టు బ్యాక్ సర్జరీలు
కారణం ఇదేనా?

మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా హాస్పిటల్ పాలవుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నాలుగు నెలల్లోనే మెగా హీరోలు అంతా వరుసగా గాయాల పాలవడం, పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.

పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స చేసారని, పది రోజుల పాటు విశ్రాంతి త్రీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజకీయాల్లో, సినిమాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అని తెలియడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఒక నాలుగు రోజుల క్రితం వరుణ్ తేజ్ బరి సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాలికి గాయం అయిందని, శస్త్ర చికిత్స చేసారని అధికారికంగానే తెలిపారు. కాలికి శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్టు వరుణ్ తేజ్ ప్రకటించాడు.

ఓ రెండు వారాల క్రితం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. ఏకంగా కంటి పై భాగానికి గాయం అయింది. చరణ్ కి కూడా ఆ గాయానికి చికిత్స చేసారు. కానీ చరణ్ ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కి వచ్చేసారు.

నాలుగు నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందని అధికారికంగానే చిరంజీవి వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ షూటింగ్, ప్రమోషన్స్ సమయంలో ఆయన కాలి నొప్పితో బాగా ఇబ్బంది పడ్డారని టాలీవుడ్ అంతా చర్చించుకుంది.

ఇక కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ సమయంలో పలు ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసాడని, చికిత్స తీసుకొని కొన్ని రోజులు రెస్ట్ అనంతరం మళ్ళీ షూటింగ్ కి వెళ్లారని టాలీవుడ్ లో టాక్ నడిచింది.

ఒకే ఇంట్లో ఉన్న హీరోలంతా ఇలా బ్యాక్-టు-బ్యాక్ గాయాల పాలవ్వడం, ఆసుపత్రి మెట్లు ఎక్కడం అభిమానుల్లో ఆందోళన నెలకొంది. “మెగా ఫ్యామిలీకి ఏమైంది? దిష్టి తగిలిందా?” అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

ఈసారి గ్యాంగ్ స్ట‌ర్ క‌థచ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబో

ఈసారి గ్యాంగ్ స్ట‌ర్ క‌థచ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబో

రామ్ చ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబోలో మ‌రో సినిమా కూడా రాబోతోంద‌న్న వార్త ఇండ‌స్ట్రీని ఊపేస్తోంది. వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేస్తార‌ని, అది గ్యాంగ్ స్ట‌ర్ క‌థ అవ్వ‌బోతోంద‌న్న ఓ వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఓ సంస్థకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలో చ‌ర‌ణ్ లుక్స్ చాలా స్టైలీష్ గా ఉన్నాయి. ఇలాంటి లుక్ తో ఓ సినిమా తీస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా సూచ‌న‌లు చేస్తున్నారు. అందుకేనేమో బుచ్చిబాబు కూడా ‘సార్‌… మ‌రో అవకాశం ఇవ్వండి’ అంటూ ఓ కామెంట్ పెట్టారు. దాంతో వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా ఖాయమంటూ ప్ర‌చారం ఊపందుకొంది. ఫ్యాన్స్ అయితే ‘బుచ్చి.. ఈసారి గ్యాంగ్ స్ట‌ర్ క‌థ రాయి. చ‌ర‌ణ్ కు సరిగ్గా స‌రిపోతుంది’ అంటూ స‌ల‌హాలు కూడా ఇస్తున్నారు.

‘పెద్ది’ గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థ‌. ఆ లుక్స్ వేరుగా ఉంటాయి. చ‌ర‌ణ్ ని స్టైలీష్ గా చూపించ‌డం కుద‌ర‌దు. ఈ లుక్స్ చూశాక‌.. చ‌ర‌ణ్ కోసం ఎలాంటి క‌థ‌లు రాయొచ్చన్న కొత్త ఆలోచ‌న‌లు ద‌ర్శ‌కుల‌కు క‌ల‌గ‌డం ఖాయం. బుచ్చిబాబు అనే కాదు, ఈ లుక్స్ ని ఏ ద‌ర్శ‌కుడైనా కాపీ కొట్టి, ఓ స్టైలీష్ క్యారెక్ట‌ర్ డిజైన్ చేస్తే ఫ్యాన్స్ కు పండ‌గే. మ‌రీ ముఖ్యంగా గ్యాంగ్ స్ట‌ర్ లాంటి క‌థ రాస్తే ఇంకా బాగుంటుంది. ‘పెద్ది’ గ‌నుక హిట్ట‌యితే… చ‌ర‌ణ్ బుచ్చికి మ‌రో ఛాన్స్ ఇవ్వ‌డం ఖాయం. అప్పుడేమైనా గ్యాంగ్ స్ట‌ర్ క‌థ బ‌య‌ట‌కు తీస్తాడేమో చూడాలి.

నువ్వు బజారోడివి కాదు.. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు వైరల్….

నువ్వు బజారోడివి కాదు.. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు వైరల్

 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu).

AnilAnil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తూ ఉన్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించాడు. అనిల్ రావిపూడి సినిమాలు అంటే క్రింజ్ ఉంటాయని, కామెడీ లేకపోయినా కుటుంబాలు మాత్రం బాగా కనెక్ట్ అవుతాయని ట్రోల్స్ వచ్చాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీలకు తప్ప యువతకు నచ్చలేదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి సినిమాలు తీయడం ఆపేయ్ అనిల్ అని కూడా కామెంట్స్ చేశారు.ఇక ఆ సమయంలోనే ఒక మీమ్ వైరల్ అయ్యింది. అందులో ఒక కుర్రాడు సంక్రాంతికి వస్తున్నాం యావరేజ్ గురు అంటే.. పక్క కుర్రాడు అవును బావా.. ఫ్యామిలీకి ఎక్కేస్తుంది అని చెప్తాడు. వెంటనే మొదటి కుర్రాడు.. అంటే ఏంట్రా నేను బజార్ నా కొడుకుని అనుకుంటున్నావా అంటూ ఫైర్ అవుతాడు. ఈ మీమ్ చాలా వైరల్ అయ్యింది. చివరికి అనిల్ సైతం ఈ మీమ్ చూసి నవ్వుకున్నట్లు తెలిపాడు.ఈ మీమ్ గురించి అనిల్ సరదాగా స్పందించాడు. ‘ ఫ్యామిలీ జోనర్ అంటే అందులో యంగ్ స్టర్స్ కూడా ఉంటారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సమయంలో నేను బజారోడినా అనే మీమ్ చూసి తెగ నవ్వుకున్నాను. అరేయ్ బాబు నువ్వు కూడా ఫ్యామిలీయే.. నీ ఫ్యామిలీతో నువ్వు వెళ్ళినప్పుడు.. నీ తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలి నువ్వు కూడా ఉన్నావ్.. నువ్వు బజారోడివి కాదు. ఆ సినిమాలో మీనాక్షీకి యూత్ కనెక్ట్ అవుతారు.సీనియర్స్ చేయడం వలన కథ కనెక్ట్ కాకపోవచ్చు కానీ, ఫన్ ఎంజాయ్ చేస్తారుగా.నేను చిన్నప్పుడు అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలకు వెళ్లాను. ఆ సమయంలో నేను చిన్నోడిని.. నా పేరెంట్స్ పెద్దోళ్ళు కదా. నేను వాళ్ళతో వెళ్లి చూసాను కదా సినిమా. నాకు నాస్టాలీజియా ఫీలింగ్స్ కదా అవన్నీ. క్లీన్ మైండ్ తో తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. ఏ జోనర్ అయితే మీకెందుకు. అమ్మానాన్నలతో కలిసి సినిమా చూడు. వాళ్లకేం నచ్చిందో వాళ్ళు తీసుకుంటారు. నీకేం నచ్చిందో నువ్వు చూడు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంటే అందరూ వస్తారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!

 అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!

 

శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌.. క్రీడాకారుల్లోని ప్రతిభని వెలికితీసి.. సరికొత్త ప్లేయర్లను క్రికెట్‌కు పరిచయం చేస్తుంది. శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్(WPL 2026) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ అనుష్క శర్మ(Anushka Sharma) తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 22 ఏళ్ల అనుష్క శర్మ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 63 బంతుల్లోనే 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఆడుతూ, అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తీరు క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంది.

వేలం నాటి నుంచే..

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం నాటి నుంచే అనుష్క శర్మ పేరు హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.45లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌ వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క.. అక్కడ దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ ఇదే..

అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ సత్తా చాటింది.డొమెస్టిక్ వన్డేల్లో ఆమెకు 63 అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ ఉంది. మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్ల తరఫున ఆడిన అనుభవం ఉంది.

పెళ్లి తరువాత బాపు బొమ్మలా మెరుస్తున్న సామ్.. ఇంతందంగా ఉందేంట్రా…

పెళ్లి తరువాత బాపు బొమ్మలా మెరుస్తున్న సామ్.. ఇంతందంగా ఉందేంట్రా

 

పెళ్లి తరువాత అమ్మాయిల అందం రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొత్త జీవితం, ప్రేమించిన వ్యక్తి.. కొత్త వాతావరణం.. ఇవన్నీ కూడా అమ్మాయి అందాన్నీ మరింత పెంచుతాయట.SaSamantha: పెళ్లి తరువాత అమ్మాయిల అందం రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొత్త జీవితం, ప్రేమించిన వ్యక్తి.. కొత్త వాతావరణం.. ఇవన్నీ కూడా అమ్మాయి అందాన్నీ మరింత పెంచుతాయట. ప్రస్తుతం అందాల భామ సమంత (Samantha) కూడా అదే కోవలో చేరింది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాకా.. సామ్ ముఖంలో లేని వెలుగు.. రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లి అయ్యాక వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ లేని విధంగా సామ్ ముఖంలో ఏదో తెలియని ఒక షైన్ కనిపిస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version