ఈసారి గ్యాంగ్ స్ట‌ర్ క‌థచ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబో

ఈసారి గ్యాంగ్ స్ట‌ర్ క‌థచ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబో

రామ్ చ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబోలో మ‌రో సినిమా కూడా రాబోతోంద‌న్న వార్త ఇండ‌స్ట్రీని ఊపేస్తోంది. వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేస్తార‌ని, అది గ్యాంగ్ స్ట‌ర్ క‌థ అవ్వ‌బోతోంద‌న్న ఓ వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఓ సంస్థకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలో చ‌ర‌ణ్ లుక్స్ చాలా స్టైలీష్ గా ఉన్నాయి. ఇలాంటి లుక్ తో ఓ సినిమా తీస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా సూచ‌న‌లు చేస్తున్నారు. అందుకేనేమో బుచ్చిబాబు కూడా ‘సార్‌… మ‌రో అవకాశం ఇవ్వండి’ అంటూ ఓ కామెంట్ పెట్టారు. దాంతో వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా ఖాయమంటూ ప్ర‌చారం ఊపందుకొంది. ఫ్యాన్స్ అయితే ‘బుచ్చి.. ఈసారి గ్యాంగ్ స్ట‌ర్ క‌థ రాయి. చ‌ర‌ణ్ కు సరిగ్గా స‌రిపోతుంది’ అంటూ స‌ల‌హాలు కూడా ఇస్తున్నారు.

‘పెద్ది’ గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థ‌. ఆ లుక్స్ వేరుగా ఉంటాయి. చ‌ర‌ణ్ ని స్టైలీష్ గా చూపించ‌డం కుద‌ర‌దు. ఈ లుక్స్ చూశాక‌.. చ‌ర‌ణ్ కోసం ఎలాంటి క‌థ‌లు రాయొచ్చన్న కొత్త ఆలోచ‌న‌లు ద‌ర్శ‌కుల‌కు క‌ల‌గ‌డం ఖాయం. బుచ్చిబాబు అనే కాదు, ఈ లుక్స్ ని ఏ ద‌ర్శ‌కుడైనా కాపీ కొట్టి, ఓ స్టైలీష్ క్యారెక్ట‌ర్ డిజైన్ చేస్తే ఫ్యాన్స్ కు పండ‌గే. మ‌రీ ముఖ్యంగా గ్యాంగ్ స్ట‌ర్ లాంటి క‌థ రాస్తే ఇంకా బాగుంటుంది. ‘పెద్ది’ గ‌నుక హిట్ట‌యితే… చ‌ర‌ణ్ బుచ్చికి మ‌రో ఛాన్స్ ఇవ్వ‌డం ఖాయం. అప్పుడేమైనా గ్యాంగ్ స్ట‌ర్ క‌థ బ‌య‌ట‌కు తీస్తాడేమో చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version