జిల్లా ల్యాండ్ సర్వే అధికారి కి వినతిపత్రం అందజేత
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ సర్వే అకాడమీ నుండి శిక్షణ పొందిన పాత లైసెన్స్ సర్వేయర్స్ జిల్లా అధికారి వి.శ్రీనివాస్ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్స్ సేవలు వినియోగించుకోవడం కోసం సిద్దమైన విషయం వీధితమే. ఈ విషయంలో భాగంగా స్పెల్ -1 శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్స్ తో పాటు కొద్దిమంది పాత లైసెన్స్ సర్వేయర్స్ కి మండలాలు కేటాయించడం జరిగింది.ఇంకా చాలా మందికి లైసెన్స్ ఉండి ప్రయివేట్ గా సర్వే పనులు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నామని,మా అందరికి కూడా మండల్ అలాట్మెంట్ చేయాలనీ కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ తదుపరి లిస్ట్ లో తప్పకుండా అవకాశం కలిపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ లైసెన్స్ సర్వేయర్స్ సదయ్య,సుధాకర్,మల్లేష్,లక్ష్మణ్,మేరాజ్,మురళి తదితరులు పాల్గొన్నారు.
