తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాల పై అవగాహన కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరు చౌరస్తాలో డ్రైవర్లకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా D.T.O. లక్ష్మణ్ హాజరై. భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులను డ్రైవర్లకు. అవగాహన కల్పిస్తూ రోడ్డు నియమ నిబంధనలపై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వికలాంగుల వీధిన.పడుతున్నాయని. వాహన.దారుడు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించుకోవచ్చు అని. అలాగే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అమలులో భాగంగా ప్రతి జిల్లాలలో కలెక్టర్లు అమలు చేస్తున్నారని దీనిని ప్రతి ఒక్క వాహనదారులు తమ బాధ్యతగా తీసుకోవాలన్నారు. రోడ్లపై కి వచ్చే వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు .నడపరాదని వాహనానికి సంబంధించిన పత్రాలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి వాహనదారులు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని. వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు దృష్టిలో ఉంచుకొని ప్రయాణం సాగించాలని నా కుటుంబం నా బాధ్యత అని బాధ్యతగా వాహనాన్ని నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా. ప్రజలు అందరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా. ప్రమాదాలు నివారించాలని అవగాహన కార్యక్రమానికి హాజరైన వారందరిచే ప్రమాణం చేయించారుఈ సందర్భంగా పలు విషయాలపై వాహనాల చట్టాలపై ప్రతి ఒక్కరూ కచ్చితంగా నిబంధనలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. R.T.A. మెంబర్ సంగీతం శ్రీనాథ్
A.M.V.i. రజిని దేవి. సిరిసిల్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి చుక్క రాజశేఖర్. వాహనాల. తనిఖీ సిబ్బంది. ఓనర్స్. డ్రైవర్స్ ఆటో డ్రైవర్ యువకులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
