ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రేవెల్లి ఓదెలు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఎరుకల జాతి చైతన్యం కోసం, ఎరుకల ప్రజా సమితి ,ఎరుకల మహిళా సమితి బలోపేతం కోసం,జాతి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా రేవెల్లి ఓదెలు అన్నారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రేవెల్లి ఓదెలు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేంసారం తిరుపతి నియామక పత్రాన్ని ఓదెలు కు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్ప, సహాయ కార్యదర్శి కుమారస్వామి, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సాయిలు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నగేష్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోశయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
