శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
నేటి ధాత్రి కథలాపూర్
శ్రీ సీతారామ చంద్రుల వార్షిక ఉత్సవమును పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమము జరిగినది మొదటి రోజున మూలవరులకు అభిషేక కార్యక్రమాలు అలంకరణ అర్చన రెండవ రోజు శ్రావణ మంగళవారం పురస్కరించుకొని మహిళలచే శ్రావణ మంగళ గౌరీ వ్రతము కుంకుమార్చన కార్యక్రమము నేడు స్వామివారి జన్మ నక్షత్రము పునర్వసు పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకం సహస్ర నామార్చన తులసీదల పుష్పాలచే జరిపించి హవన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో చైర్మన్ ఇట్టెడి సంజీవ్ రెడ్డి వైస్ చైర్మన్ తిక్క గంగారెడ్డి మరియు డైరెక్టర్ లు ప్రజలు హనుమాన్ భక్తమండలి వారు పాల్గొనడం జరిగింది