ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భగీరథ మహర్షి జీవిత విధానం, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి సేవలు ఆదర్శంగా తీసుకోవాలి అని ఎమ్మెల్యే సత్యనారాయణ
గురువారం ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు కల్లు గీత కార్మికుల కోసం రక్షక కవచం శిక్షణ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భగీరథ మహర్షి జీవిత విధానం, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే కల్లు గీత కార్మికుల భద్రత ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వారికి అవసరమైన రక్షణ పరికరాలు వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు ప్రజా సంఘాలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్లేట్లు, అన్న వితరణ పంపిణీ…

విద్యార్థులకు ప్లేట్లు, అన్న వితరణ పంపిణీ

తాండూరు, నేటి దాత్రి:

తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఉమ్మడి ద్వారాకపూర్ మాజీ సర్పంచ్ దివంగత సాత బానయ్య రెండో వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కాసిపేట ప్రాథమికోన్నత పాటశాల విద్యార్థులకు ప్లేట్లు, అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముదాం వనజ మాట్లాడుతూ.. దివంగత మాజీ సర్పంచ్ సాత బానయ్య ఉమ్మడి ద్వారాకపూర్ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. వర్థంతి నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కస్తూరీ మాధురి, శ్రీధర్, ఉప సర్పంచ్ బోయిని సుమలత, మాజీ గ్రంథాలయ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు, డిసిసి ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గట్టు మురళీధర్ రావు, మాజీ జెడ్పీటిసి సాలిగాం బానయ్య, మాజీ ఎంపిపి సిరంగి శంకర్, వార్డు సభ్యులు గోవర్ధన్, గోపాల్, తిరుపతి, రమేష్, నాయకులు సంతోష్, నాగరాజు, సాగర్, ఎస్ సంతోష్, కిరణ్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version