గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు…

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పోలీసు వారికి వచ్చిన నమ్మదగిన సమాచారంతో మందమర్రి అంగడి బజార్ ,శివాలయం రోడ్ లో గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ సమీరుద్దీన్ అలియాస్ సమీర్ ,తండ్రి యూసఫ్ ఉద్దీన్ , వయసు: 21 సం, నివాసం: అంగడి బజార్, మందమర్రి లోఈ రోజున అరెస్టు చేశారు. మందమర్రి ఎస్సై జి నరేష్ గారు నేరస్తుని వద్ద నుంచి 165 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి తదుపరిచర్యకై నేరస్థున్ని అదుపులోనికి తీసుకోవడం జరిగింది అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో మందమర్రి పోలీస్ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.

తుర్కకాశ సంఘం నూతన కమిటీ ఎన్నిక..

తుర్కకాశ సంఘం నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా ఇమామ్ ఉపాధ్యక్షులుగా ఎస్కే మున్న

నేటి ధాత్రి అయినవోలు

 

అయినవోలు మండలం లింగమొరిగూడెం గ్రామంలో మంగళవారం తుర్క కాశ సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా ఎం.డి. ఇమామ్‌ను, ఉపాధ్యక్షుడిగా ఎస్‌కే. మున్నాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుడిగా ఎస్‌కే. మదర్ (చంటి)ను, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే. చిన్న మదర్‌ను నియమించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంఘ ఐక్యత, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.A

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version