బీసీలకు నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక ఎన్నికల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీల అవకాశాలను రెడ్లకు దోచిపెడుతోందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తామని మాటిచ్చి కేవలం 17 శాతానికి కుదించి ఆగమేఘాల మీద ఎన్నిక లకు వెళ్లడం ముమ్మాటికీ నమ్మకద్రోహమే అవుతుందని ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ అన్నారు.ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జరిగితే దాదాపు 5,300 మంది బీసీలు సర్పంచ్లు అయ్యేవారని, 17 శాతం రిజర్వేషన్లే రావడంతో 2,176 మందికే పరిమితం అయ్యారని చెప్పారు.42 శాతం చట్టబద్ధంగా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపరంగా కూడా ఇవ్వకుండా మరోమారు బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని చెప్పారు.
