సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జెండా ఆవిష్కరణ
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ 57వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పట్టణ కార్యదర్శి బంధు సుజాత జెండా ఎగరవేయడం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ నక్సల్ బరి రైతాంగ ఉద్యమ జ్వాలలో పుట్టిన పార్టీ ఇది కమ్యూనిస్టు ఉద్యమ సంపూర్ణ వారసత్వాన్ని గర్వంగా స్వీకరించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రజల ధైర్యం శక్తి సృజనాత్మక త ఆధారంగా తనను తాను పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగుతుంది ప్రపంచవ్యాప్తంగా పాలకవర్గాలు అనేకసార్లు కమ్యూనిస్టు ఉద్యమం ముగిసిందని ప్రకటించినప్పటికీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ మళ్లీ ఊపిరి పోసుకొని ముందుకు సాగుతుంది ఈరోజు ఫాసిస్ట్ పాలకులు కమ్యూనిస్టులను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తూ దేశాన్ని ప్రజలను సామ్రాజ్యవాదానికి అప్పగిస్తున్న సమయంలో సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు జెండాను ఎగరవేసి నిజమైన సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్యం గణతంత్రం కోసం పోరాటాన్ని నడిపించాలి మన అమరవీరుల గొప్ప ఆశయాలను నెరవేర్చడానికి ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి సిపిఐ ఎంఎల్ ను అన్ని విధాలుగా విస్తరించి పార్టీని బలోపేతం చేద్దాం అని పిలుపును ఇచ్చారు ఐసా రాష్ట్ర నాయకులు శీల పాక నరేష్ వి సి కె పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బంధు క్రాంతి ఆత్కూరిశ్రీకాంత్.. కన్నూరు డానియల్ ఆకునూరు జగన్ పార్టీ నాయకులు బందు సుజాత బుర్రస్వాతి…రాజమణి రోహిత్ బంధు తదితరులు పాల్గొన్నారు
