ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా…

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా

పావుశెట్టి సునీల్ 7వ వార్డు అభ్యర్థి

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని 7వ వార్డులో పావుశెట్టి సునీల్ విస్తృత ప్రచారం నినాదాలతో ఉత్సాహంగా సాగింది.ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.తాగునీరు,డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానన్నారు.వార్డు అభివృద్ధికి సమిష్టిగా పని చేస్తామని తెలిపారు.
ప్రజల మద్దతే తన బలమని ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.ప్రచారంలో నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

9వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి…

9వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి

* గడప గడప ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్, జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పని చేసేవారికి పట్టం కట్టాలని బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మంచిరోజులు వస్తాయని రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్, జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీలో ని 9వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తూము యమున శ్యామ్ పటేల్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా
అలియాబాద్ మున్సిపాలిటీ లో పోటీచేస్తున్నారని కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి చాట్ల పల్లి నర్సింగ్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిళ్ళ శ్రీనివాస్, కార్యనిర్వాహన కార్యదర్శి ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version